సుధీర్ మామూలోడు కాదుగా… ఏకంగా వారితో కలిసి అంత పని చేశాడు?

సుడిగాలి సుధీర్ గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. సుధీర్, రాంప్రసాద్, శ్రీను కలసి చేసే స్కిట్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రష్మి తో ఉన్న లవ్ ట్రాక్ వల్ల సుధీర్ మరింత ఫేమస్ అయ్యాడు. ఇలా తనకి ఇంత మంచి గుర్తింపు ఇచ్చిన జబర్దస్త్ కి సుధీర్ దూరమయ్యడు. సినిమా అవకాశాలు ఎక్కువగా రావటం, పక్క ఛానల్ వారు అధిక రెమ్యూనరేషన్ ఇవ్వటం వల్ల సుధీర్ జబర్దస్త్ కి స్వస్తి చెప్పాడు. గత కొన్ని రోజులుగా సుధీర్ మా టీవీలో ప్రసారమవుతున్న షోస్ లో సందడి చేస్తున్నారు.

ఇక మా టీవీలో కూడా సుధీర్ తన పని మొదలు పెట్టాడు. సూపర్ సింగర్ జూనియర్స్ అనే షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇంకా మాటీవీలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ అని షోలో కూడా సుధీర్ సందడి చేస్తున్నాడు. అంతే కాకుండా మా టీవి లో ప్రసారం కానున్న మరొక కొత్త షో లో కూడా సుధీర్ రచ్చ మొదలు పెట్టాడు. ప్రస్తుతం అంటే సుందరానికి.. అనే కొత్త షో మా టీవీ లో ప్రసారం కానుంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి అనే పేరుని ఈ షో కి పెట్టారు. ఈ షో ఈ నెల 17 అంటే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కాబోతోంది.

ఇక తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ఈ షో లో సుడిగాలి సుధీర్ ఎంట్రీ అదిరిపోయింది. ఎప్పటిలాగే తన మార్క్ తో ఆకట్టుకున్నాడు. ఇక యువరాజు గెటప్ లో సుధీర్ అమ్మాయిలతో కలిసి ఆడిపాడాడు. యువరాజు గెటప్ లో ఉన్న సుదీర్ యువరాణులతో కలిసి బాణాలు వేస్తూ రెచ్చిపోయాడు. మొత్తనికి ఈ ఆదివారం ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేయనున్నారు. ఇక ఈ కొత్త షో లో ఎక్స్ ప్రెస్ హరి.. ముక్కు అవినాష్.. రోహిణీ తదితరులు కూడా ఉన్నారు. ఈ ప్రోమోలో అమ్మాయిలతో కలిసి సుధీర్ ఉట్టి కొడుతూ.. బాణాలు ఎక్కుపెట్టి విలు విద్యలు నేర్పిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.