ఆహా లో సందడి చేయడానికి సిద్ధమైన సుధీర్.. సంతోష పడుతున్న ఫ్యాన్స్?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు. సుధీర్ జబర్దస్త్ కార్యక్రమంతో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలతో ఎంతో మంచి ఆదరణ పొందారు అయితే మల్లెమాలవారికి సుధీర్ కి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ సుదీర్ మాత్రం ఈ కార్యక్రమాలకు దూరమై స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు అయితే ఈ కార్యక్రమం పూర్తి కావడంతో సుధీర్ బుల్లితెర కార్యక్రమాలలో ఏమాత్రం కనిపించడం లేదు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వచ్చిన అనంతరం సుదీర్ పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారని జబర్దస్త్ వదిలి వచ్చి తప్పు చేశారంటూ అభిమానులు భావించారు అయితే బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి సుధీర్ ఏకంగా తెలుగు ఓటీటీ ఆహా ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఆహా వేదికగా ప్రసారమవుతున్నటువంటి కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నామంటూ ఆహ్వానం దక్కింది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇదివరకే విడుదల అయింది. ఇక ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ తో పాటు ముక్కు అవినాష్ యాదమ్మ రాజు,హరి వంటి వారు కూడా సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ కాగా త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసార తేదీని కూడా ప్రకటిస్తున్నట్లు సమాచారం.ఏది ఏమైనా బుల్లితెరకు సుదీర్ దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులకు ఈయన ఆహా ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలియడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.