సొంత గూటికి చేరిన సుధీర్… పంచులతో పరువు తీస్తున్న ఆది?

జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొంది హీరోగా మారిన సుధీర్ సినిమా అవకాశాలు ఎక్కువగా రావటంతో తనకు జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ కి దూరమయ్యాడు. ఈ క్రమంలో సినిమాలు పేరు చెప్పి జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన సుధీర్ మాటీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్స్ జూనియర్స్ అనే సింగింగ్ షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.దీంతో మా టీవీ వారు ఇచ్చే అధిక రెమ్యునరేషన్ కి ఆశపడి సుధీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలం ఈటీవీలో కనిపించని సుధీర్ ఇటీవల ఒక కార్యక్రమంలో సందడి చేశాడు.

ఈటీవీ ప్రారంభించి ఇప్పటికీ 27 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా భలే మంచి రోజులు అనే ఒక కార్యక్రమాన్ని మల్లెమాలవారు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆదివారం ప్రసారం కానుంది. ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కి దూరమైన సుధీర్ తో పాటు అనసూయ కూడా సందడి చేసింది. సుధీర్ ఈటీవీలో రియల్ ఇవ్వటంతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సుధీర్ నటించిన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సుధీర్ మళ్లీ సొంత గూటికి తిరిగి వచ్చాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇలా ఈటీవి కి తిరిగి వచ్చిన సుధీర్ మీద ఆది పంచులు వేస్తూ రెచ్చిపోయాడు. ఈ కార్యక్రమంలో ఒక స్కిట్ లో సుధీర్ సర్ మనకి బ్రేక్ లేదా? అని అడగ్గా నీకు ఎప్పుడో బ్రేక్ ఇచ్చాం.నువ్వు ఇంకా ఇక్కడెందుకు ఉన్నావు? అంటూ ఆది సెటైర్ వేసాడు. ఇక మరొక సందర్భంలో ఇమన్యుల్ తన మర్దనా చేయమని ఆర్డరు వేయగా.. సుధీర్ మర్దనా చేస్తాడు.దీంతో.`ఏ స్టేజ్‌కి వచ్చావబ్బా` అని ఇమన్యుల్ సెటైర్ వేస్తాడు.l ఇక ఈ సందర్భంలో ఆది మరింత రెచ్చిపోయి నాకు కూడా కొంచం మోకాలు నొప్పిగా ఉంది అని అనగానే సుధీర్ వెళ్లి ఆది కాలు పట్టడానికి కింద కూర్చుంటాడు. చూసావా మనల్ని బ్యాడ్ చేయటానికి వీడు ఎంత కిందకి వెళ్ళిపోయాడు అని పంచ్ వేస్తాడు. ఎవరు ఎన్ని సెటైర్లు వేసినా కూడా సుధీర్ మాత్రం చిరునవ్వుతో ఉన్నాడు.