చివరి నిమిషంలో బిగ్ బాస్ ఆఫర్ ని తిరస్కరించిన స్టార్ సెలబ్రిటీస్.. ఎవరంటే?

బుల్లితెర మీద ప్రసారమైన పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ షో తెలుగులో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమాతో సక్సెస్ ఫుల్ గా 5 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇటీవల 24 గంటల ఎంటర్టైన్మెంట్ అంటూ ఓటిటిలో ప్రసారమైన ఈ షో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 హడావిడి మొదలైంది. సెప్టెంబర్ 4వ తేదీ నుండి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానుంది. ఈ సీజన్6 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో ముగ్గురు సామాన్యులకి అవకాశం కల్పిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. అందువల్ల ఈ షో లో పాల్గొనే కంటిస్టెంట్స్ గురించి తెలుసుకోవటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు .

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే కొంతమంది కంటిస్టెంట్ల పేరు వినిపిస్తున్నాయి. ఈ బిగ్ బాస్ సీజన్ 6 కోసం 21 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో యాంకర్ ఉదయభాను పేరు కూడ వినిపిస్తోంది. పాపులర్ యాంకర్ గా గుర్తింపు పొందిన ఉదయభాను అత్యధిక రిమ్యునరేషన్ ఆఫర్ చేసి బిగ్ బాస్ లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో ఉదయభాను హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సీజన్ సిక్స్ లో ఇద్దరు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు ఇద్దరు సింగర్లు, ఇద్దరు యాంకర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ ద్వారా ఫెమస్ అయిన దీపికా పిల్లి ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఈమెకు కూడా బిగ్ బాస్ నుండి ఆహ్వానం అందినట్టు తెలుస్తొంది. బిగ్ బాస్ ప్రారంభం కావటానికి ఒక వారం ముందు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్లను కారంటైన్ లో ఉంచాలని బిగ్ బాస్ యాజమాన్యం నిర్ణయించుకుంది. అయితే చివరి నిమిషంలో ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ కి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారెవరో కాదు యాంకర్ ఉదయ భాను, మరొకరు దీపికా పిల్లి. ఒకరు డేట్స్ కుదరక బిగ్ బాస్ కి హ్యాండ్ ఇస్తే… మరొకరు వ్యక్తిగత కారణాల వల్ల బిగ్ బాస్ షో కి హ్యాండ్ ఇచ్చారు.