బిగ్ బాస్ హౌస్ లో సోహెల్, మెహబూబ్ ఫ్రెండ్ షిప్ గురించి తెలిసిందే కదా. హౌస్ లోకి వచ్చిన రెండో వారం నుంచి సోహెల్, మెహబూబ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ వస్తున్నారు. టాస్క్ అయినా.. ఇంకేదయినా కూడా ఇద్దరూ మంచి సపోర్ట్ ఇచ్చుకునేవాళ్లు. ఇద్దరూ పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేవాళ్లు. నిజం చెప్పాలంటే హౌస్ లో వాళ్లంత బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకెవరూ కాలేదు. నామినేషన్స్ లో వాళ్లిద్దరు ఒకరికి మరొకరిని నామినేట్ చేసేవాళ్లు కాదు. కెప్టెన్సీ టాస్క్ లో బాగా ఇద్దరూ ఆడేవాళ్లు. ఒకరికి సపోర్ట్ కావాలంటే మరొకరు ఇచ్చేవారు. ఇలా… వాళ్లిద్దరూ ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ గా నిన్నటి వరకు ఉంటూ వచ్చారు.
కానీ.. బిగ్ బాస్ పల్లెకు పోదాం చలో చలో అనే టాస్క్ ఇచ్చాక.. ఆ టాస్క్ లో సోహెల్ ప్రవర్తించిన తీరుతో మెహబూబ్ చాలా బాధపడ్డాడు. ఆ టాస్క్ లో తనకు అన్నగా నటించిన అవినాష్ తో క్లోజ్ గా ఉంటున్నాడు. పల్లెకు పోదాం చలో చలో టాస్క్ లో భాగంగా.. అవినాష్ అన్నగా.. మెహబూబ్ తమ్ముడిగా నటించాడు. అలా వాళ్లిద్దరి మధ్య ఓ బాండ్ ఏర్పడింది. అదే ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది.
అందులోనూ అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అవ్వడం.. అవినాష్, మెహబూబ్ కు బాత్ రూం మాత్రమే కడగాలంటూ చెప్పడంతో… వాళ్లకు తక్కువ వర్క్ ఇచ్చారంటూ ఇంటి సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే మిగితా వాళ్లకు ఎక్కువ పని ఇచ్చారని.. అలా ఎలా కుదురుతుందని అమ్మ రాజశేఖర్ పై అందరూ విరుచుకుపడ్డారు.
ఈనేపథ్యంలోనే సోహెల్, మెహబూబ్ కు గొడవ అవుతుంది. నువ్వు వద్దు.. నీ ఫ్రెండ్ షిప్ వద్దురా బాబు.. అంటూ సోహెల్ కు మెహబూబ్ దండం పెట్టడంతో కోపంతో రగిలిపోతాడు సోహెల్. ఏదన్నా ఓకే కానీ.. ఫ్రెండ్ షిప్ వద్దు అంటూ దండం పెట్టడం ఏంది? అంటూ కోప్పడతాడు. అలా వాళ్లిద్దరి మధ్య బాండ్ బ్రేక్ అవుతుంది. సోహెల్ తో కట్ అయిపోయి.. అవినాష్ తో మెహబూబ్ క్లోజ్ గా ఉండటం మొదలు పెడుతున్నాడు. చూద్దాం.. ఈ లొల్లి ఇంకా ఎంత దూరం పోతుందో?