కొత్త కారు కొన్న బిగ్ బాస్ సిరి.. సిరి గురించి అలాంటి కామెంట్ చేసిన ప్రియుడు శ్రీహాన్!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వార ఏంతో మంది పాపులర్ అయ్యరు. అలా బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో సిరి హన్మంత్ ఒకరు. బిగ్ బాస్ ద్వారా ఈ అమ్మడు నెగటివిటీ మూటగట్టుకొని ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ తో సిరి చేసిన రొమాన్స్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. వీరిద్దరూ ప్రేమికులు లాగా ప్రవర్తిస్తూ.. మేము స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ప్రతీ ఎపిసోడ్‌లో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. వీరి వ్యవహారం వల్ల బయట జరుగుతున్న టాక్ గురించి తన కన్న తల్లి చెప్పినా కూడా వినలేదు. హగ్గులు, ముద్దులు తనకు నచ్చలేదని చెప్పినా, బయట జరుగుతున్న దానిపై హింట్ ఇచ్చినా కూడా సిరి షన్నులు మారలేదు.

మొత్తానికి బిగ్ బాస్ ద్వారా ఇద్దరు నెగెటివిటీ మూట కట్టుకుని బయటికి వచ్చారు. అయితే వీరు బయటికి వచ్చిన తర్వాత దీప్తి షణ్ముఖ్ కి, శ్రీహాన్ సిరికి బ్రేకప్ చెప్పారు. షణ్ముఖ్ తో దీప్తి సునైన ఇప్పటికీ మాట్లాడటం లేదు. అయితే సిరి మాత్రం తన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కి మళ్ళీ దగ్గరయింది. వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగి ఇద్దరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో యూట్యూబ్ వీడియోస్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఇప్పుడు కూడా వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తరువాత తాజగా సిరి ఒక కొత్త కారును కోనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సిరి కొత్త కారుకి సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలలో సిరితో పాటు శ్రీహాన్ కూడా ఉన్నాడు. అయితే సిరి కొత్త కారు కొనడంపై శ్రీహాన్ కౌంటర్లు వేశాడు. ముందు డ్రైవింగ్ నేర్చుకో అని సెటైర్లు వేశాడు. మొత్తానికి సిరి, శ్రీహాన్‌లు జంటగా ఇలా కారు కొనేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీహాన్ లో పాల్గొంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొంత కాలం ఆగాలి.