నూతన గృహప్రవేశం చేసిన సింగర్ న్రాహుల్.. వైరల్ అవుతున్న ఆషూ రెడ్డి కామెంట్స్…!

బుల్లితెర మీద ప్రసారమైన బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు పొందారు. ఈ బిగ్ బాస్ ద్వార గుర్తింపు పొందింన వారిలో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒకరు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ప్లే బ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు పొందిన రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని టైటిల్ దక్కించుకున్నాడు. ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సీజన్ 3 లో పాల్గొన్న ఆషు రెడ్డితో రాహుల్ కి ఉన్న లవ్ ట్రాక్ వల్ల వీరిద్దరూ బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న సమయంలోనే కాకుండా హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ పబ్బులు పార్టీలు అంటూ కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేసేవారు.

దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. వీరి ప్రవర్తన కారణంగా ఈ వార్తలు మరింత బలం అయ్యాయి. అంతేకాకుండా రాహుల్ సిప్లిగంజ్ చేసిన ఆల్బమ్ కి ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా ఆశూ ఎంతో హెల్ప్ చేసిందని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇలా వీరిద్దరూ ఒకరి గురించి ఒకరికి పోగుడుకుంటు వీరిమధ్య ఉన్న స్నేహాన్ని సోషల్ మీడియాలో ద్వారా తెలియజేసేవారు. దీంతో వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారని తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్లు వినిపించాయి. అయితే వీరి మధ్య ఉన్న ఈ అనుబంధం చాలా కాలం నిలువలేక పోయింది. కొంతకాలం కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేసిన వీరిద్దరూ ఉన్నట్టుండి ఎవరి పనులలో వారు బిజీ అయిపోయారు.

ఈ క్రమంలో ఆశు రెడ్డి ఇటీవల పూర్తైన బిగ్ బాస్ ఓటిటి లో కూడా పాల్గొనింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు రాహుల్ సొంతంగా ఇళ్లు కట్టుకోవాలన్న కోరికను బయటపెట్టాడు. అయితే ఇటీవల రాహుల్ తన సొంత ఇంటి కల నెరవేర్చుకున్నాడు. ఇటీవల రాహుల్ కొత్త ఇంట్లో అడుగుపెట్టి తన కల నెరవేర్చుకున్నాడు. ఈ విషయాన్నీ రాహుల్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. అయితే ఈ సందర్భంగా ఆశు రెడ్డీ కంగ్రాట్స్ చెబుతూ రెడ్ హార్ట్స్ సింబల్స్ పెట్టీ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆశు చేసిన కామెంట్స్ వైరల్ గా మరాయి.