రాణా టాక్ షో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి నాని, ప్రియాంక మోహనన్, తేజ సజ్జ గెస్టుగా వచ్చి షోలో సందడి చేశారు. తాజాగా సెకండ్ ఎపిసోడ్ లో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ శ్రీలీల గెస్ట్లుగా వచ్చి షో లో తెగ సందడి చేశారు సిద్దు, సెన్సాఫ్ హ్యూమర్ కి రాణా, శ్రీలీల పడి పడి నవ్వారు.
రాణా సిద్దు ని అడిగిన ప్రశ్నలకు సిద్దు టక టక సమాధానాలు చెబుతూ ఉండటంతో రాణా , శ్రీ లీల ఇద్దరూ నోరెళ్ళ పెట్టేశారు. సిద్దు షో కి రావడంతోనే ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు రానా, వాటికి వెంటవెంటనే సమాధానాలు చెప్తూ ఇవి కూడా ఒక ప్రశ్నలా,వీటికి సమాధానాలు చెప్పటానికి ఇక్కడ వరకు రావాలా అంటూ షో పరువు తీసేసాడు. రాణా శ్రీ లీలని హోస్ట్ చైర్ లో కూర్చోబెట్టి అలా ఒక్కసారిగా తిప్పేయడంతో శ్రీలీల కిందపడిపోయింది.
ఏంటి నువ్వు పడిపోయావా అని రాణా శ్రీలీల ని ఆట పట్టిస్తుంటే ఏంటి నేను పడిపోయినా నీకు తెలియడం లేదా.. నేను కూర్చున్నా,పడిపోయినా ఒకటే హైట్ ఉన్నానా అంటూ శ్రీ లీల వేసిన కౌంటర్ కి రాణా తెగ నవ్వాడు. షో మధ్యలో తన స్కిన్ ప్రోడక్ట్ బ్రాండ్ న్యూడ్ గురించి ప్రమోట్ చేసుకుంది శ్రీ లీల. ఇది రాణా టాక్ షో నా లేదంటే నీ ప్రొడక్షన్ ని ప్రమోట్ చేసుకునే షోను అంటూ సిద్దు వేసిన కౌంటర్లకి నవ్వకుండా ఉండలేకపోయారు రాణా, శ్రీ లీల.
ఇక తన సినిమా కృష్ణ అండ్ హిస్ లీల సినిమా టైం అప్పుడు రాణా తో జరిగిన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు సిద్దు. సినిమా ఓకే చేసి రాణా అమెరికా వెళ్లిపోయాడని అప్పుడు సురేష్ బాబు మా మూవీని పర్యవేక్షించారని, సినిమాకి సంబంధించి ఎన్నో ప్రశ్నలు అడిగారని మొత్తానికి రాణా వల్ల మొదలైన ప్రాజెక్ట్ సురేష్ బాబు గారి ఇన్స్పెక్షన్ తో పూర్తయిందని చెప్పుకొచ్చాడు సిద్దు. ప్రస్తుతం ఈ ఎంటర్టైన్మెంట్ షో అమెజాన్ ప్రైమ్ లో రన్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.
He’s such a fun guy pic.twitter.com/d9H9e2tali
— kkura (@ssmbbakthudu) November 30, 2024