బిగ్ బాస్ కోసం ఆర్జె సూర్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టీవీ9 లో ప్రసారమవుతున్న ఇస్మార్ట్ న్యూస్ ద్వారా ఫేమస్ అయిన ఆర్జె సూర్య బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న తర్వాత సూర్య మరింత పాపులర్ అయ్యాడు. 8 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన సూర్య ఎనిమిదవ వారంలో ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాడు. అయితే సూర్య హౌస్ లో ఉన్నన్ని రోజులు అమ్మాయిలతో మాటలు కలిపి వారితో కాలక్షేపం చేస్తూ పులిహోర రాజాగా పేరు పొందాడు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆరోహి రావు, ఇనయా సుల్తానాతో సూర్య నడిపిన ప్రేమ వ్యవహారం కొంతకాలం హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సూర్య రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. బిగ్ బాస్ షో లో పాల్గొన్నందుకు ఆర్జే సూర్యకి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం…ఒక వారానికి లక్షన్నర వరకు సూర్యకి రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన 8 వారాల కోసం సూర్య దాదాపు 12 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్యకి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ గురించి ప్రశ్న ఎదురయింది. ఇక ఈ ప్రశ్నకు సమాధానంగా సూర్య మాట్లాడుతూ..” మీకే హిట్ ఇస్తున్నాను నెలలో నాకు వచ్చే జీతం బిగ్ బాస్ లో ఒక వారానికి ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీవీ నైన్ లో పనిచేస్తున్న ఆర్జె సూర్యకి నెలకు 60 వేల వరకు జీతం అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు ఒక వారానికి 60 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇచ్చాడు. ఇలా వారానికి 60 వేల రూపాయల చొప్పున 8 వారాలకి గాను దాదాపు 5 లక్షల వరకు సూర్య రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.