బిగ్ బాస్ విన్నర్ అని చెప్పుకోవడం మానేశా.. బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సన్నీ!

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.అయితే ఇప్పటికే తెలుగులో ఈ కార్యక్రమం ఐదు సీజన్ పూర్తి చేసుకోగా ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈ కార్యక్రమం ప్రసారమైన ప్రతి సీజన్లోనూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పై ఎన్నో విమర్శలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజానికి ఏం తెలియజేస్తున్నారు అంటూ ఎంతో మంది ఈ కార్యక్రమం పై మండిపడ్డారు. ఇలా ఈ కార్యక్రమం పై సదరు ప్రేక్షకులు ఇతర సామాజిక కార్యకర్తలు మండిపడిన ఒక అర్థం ఉంది.

ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొని టైటిల్ కోసం ఎంతో కష్టపడి చివరికి టైటిల్ గెలిచినటువంటి విన్నర్ వీజే సన్ని సైతం బిగ్ బాస్ కార్యక్రమం పై విమర్శలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సందర్భంగా సన్నీ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఏకంగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అయితే ఇదంతా కూడా బిగ్ బాస్ విజేతగా గెలిచిన తర్వాతే అవకాశాలు వచ్చాయి.అయితే తాజాగా ఈయన బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభం కావడంతో ఈ కార్యక్రమం పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాను బిగ్ బాస్ విన్నర్ అని చెప్పుకోవడమే మానేశానంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ కార్యక్రమం ఒక చెత్త షో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇక తాను బిగ్ బాస్ విన్నర్ అని చెప్పగానే అయితే మాకేంటి అంటూ చాలామంది మొహం మీదే అంటున్నారు. ఒక టాలీవుడ్ డైరెక్టర్ సైతం బిగ్ బాస్ విన్నర్ అయితే ఏంటి అని అడిగారని అందుకే అప్పటినుంచి తాను బిగ్ బాస్ విన్నర్ అని ఎక్కడ చెప్పుకోలేదు అంటూ ఈ సందర్భంగా సన్నీ బిగ్ బాస్ కార్యక్రమం గురించి కామెంట్స్ చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.