ఇండియాస్ నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు ఇటీవల ప్రారంభం అయింది. ఈ సీజన్లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అయితే వీరిలో ఇప్పటికే 8 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం 13 మంది బిగ్ బాస్ టైటిల్ కోసం పోరాడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఆరోహి రావు ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ కీర్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ కోసం పోరాడుతున్న కీర్తిని సపోర్ట్ చేసినందుకు ఒక నెటిజన్ ఆరోహి రావు ను ప్రశ్నించాడు. దీంతో ఆ ప్రశ్నకు సోషల్ మీడియా వేదికగా సమాధానం చెబుతూ.. కీర్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సాధారణంగా కొంతమంది ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం గుర్తింపు లభించవు. కానీ గెలుపు కోసం నిత్యం పోటీ పడుతూనే ఉంటారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో కూడా కొంతమంది ఎంత కష్టపడినా కూడా వారి కష్టానికి గుర్తింపు లభించలేదని… అందుకు మంచి ఉదాహరణ గత సీజన్ లో పాల్గొన్న మానస్. టైటిల్ కోసం తోటి కంటెస్టెంట్లకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా కూడా మానస్ కి సరైన గుర్తింపు లభించలేదు. ఇక ఇప్పుడు తన స్నేహితురాలు అయిన కీర్తికి కూడా తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించటం లేదు అంటూ చెప్పుకొచ్చింది. కీర్తి ఫిజికల్ టాస్కులలో ఆడటం లేదు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు.. అంటూ కామెంట్స్ చేసినవారికి ఆరోహి గట్టిగా సమాధానం ఇచ్చింది.
అలా కామెంట్ చేసిన వారికి సమాధానం చెబుతూ.. ” కీర్తి రెండు కాళ్లలో రాడ్లు ఉన్న సంగతి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. అయినప్పటికీ కీర్తి ఆ ప్రస్తావన బయటకి తీసుకురాకుండా సింపతి కోసం ట్రై చేయకుండా తన వంతు ఆట ఆడుతూ గట్టి పోటీ ఇస్తోంది. రోడ్డు ప్రమాదంలో ఏర్పడిన గాయాల తాలూకా పెద్దపెద్ద గుర్తులు మచ్చలు ఇప్పటికి తన శరీరంపై మాత్రమే కాకుండా తన మనసులో కూడా ఉన్నాయి. మచ్చ అంత తొందరగా పోదు కదా…. అన్నీ బాగున్న మనమే పోరాడి అలసిపోతున్నాము. అలాంటి ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. అందుకే నేను ఎప్పటికీ కీర్తీ కి సపోర్ట్ చేస్తూనే ఉంటాను… ” అంటూ కీర్తీ మనో దైర్యం గురించి గొప్పగా చెప్పింది. దీంతో నెటిజన్స్ కూడా కీర్తీ పోరాటాన్ని సపోర్ట్ చేస్తున్నారు.