బిగ్ కాన్ఫిడెన్స్: నేనే పెద్ద ‘తోపు’ అనుకుంటున్నషణ్ముఖ్

Shanmukhs Over Confidance All Because Of | Telugu Rajyam

హౌస్‌లో మొదట్నించీ సేఫ్ ప్లే ఆడుతున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. ఎప్పుడూ మోజ్ రూమ్‌లో ముచ్చట్లు పెడుతుంటాడు.. అనే ముద్ర షణ్ముఖ్ జశ్వంత్‌పై ఉంది. అంతేకాదు, సిరి హన్మంత్, జశ్వంత్‌లను బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంటాడు కూడా. ఈ ముగ్గురినీ బిగ్‌బాస్ త్రిమూర్తులుగా అభివర్ణిస్తున్నారు ఈ సీజన్‌కి.

ఇకపోతే, షణ్ముఖ్ విషయం తీసుకుంటే, హౌస్‌లో తానో పెద్ద తోపు అని ఫీలవుతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది సోషల్ మీడియాలో. ఎవరైనా సరే, రియలైజ్ అయ్యి మన దగ్గరకు రావల్సిందేరా.. అంటూ తన ఫ్రెండ్స్ సిరి, జెస్సీతో చెప్పడం, అతనిలోని ఓవర్ కాన్ఫిడెన్స్‌ను బయట పెట్టింది.

తన ఆట తాను ఆడకుండా, మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికే షన్నూ ఎక్కువ ట్రై చేస్తున్నాడు. ప్రతీ సందర్భంలోనూ ఆ ఆటిట్యూడ్‌ని ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో ఈ ఇంపాక్ట్ వల్ల ఆయన అభిమానులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. మోజ్ రూమ్‌ ముచ్చట్లు మాని, మిగిలిన కంటెస్టెంట్స్‌తో ఇంకా బాగా కలిసిపోవాలనీ, అంతేకాదు, మల్టీ టాలెంటెడ్ అయిన షన్నూ ఇంతవరకూ తన టాలెంట్ బయట పెట్టేలా ప్రవర్తించలేదనీ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

ఇంతవరకూ ఓ ఎత్తు.. ఇకపై ఇంకో ఎత్తు.. అనేలా కంటెస్టెంట్స్ అంతా తమ తమ గేమ్ ప్లానింగ్ ఛేంజ్ చేసుకునే యోచనలో ఉన్నారు. మరి, షన్నూ ఏం చేస్తాడో చూడాలిక.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles