నారి నారి నడుమ మురారి.. ఆ ఇద్దరితో శేఖర్ మాస్టర్ రొమాన్స్!!

శేఖర్ మాస్టర్ బుల్లితెరపై కనిపించక చాలా రోజులే అవుతోంది. మామూలుగా అయితే ఢీ షోలోనే కాకుండా అప్పుడప్పుడు జబర్దస్ స్టేజ్ మీద కూడా కనిపిస్తూ నవ్విస్తుంటాడు. అవే కాకుండా ఏదైనా స్పెషల్ ఈవెంట్లు చేస్తే అందులోనూ దుమ్ములేపుతాడు. అలా శేఖర్ మాస్టర్ బుల్లితెర ప్రేక్షకలకు చాలా దగ్గరయ్యాడు. అలాంటి శేఖర్ మాస్టర్‌కు కరోనా వచ్చింది. దాంతో దాదాపు నెల రోజుల పాటు బుల్లితెరకు దూరంగా ఉండిపోయాడు.

Sekhar master Grand Re Entry With Akka Evare Athagadu
Sekhar master Grand Re Entry With Akka Evare Athagadu

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా కూడా ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో గడిపాడు. తన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకున్నాడు. అయితే ఢీ షోలో శేఖర్ మాస్టర్ స్థానాన్ని బాబా భాస్కర్ భర్తీ చేస్తున్నాడు. శేఖర్ మాన్టర్ కంటే వేరే లెవెల్‌లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అయితే ఇక శేఖర్ మాస్టర్ త్వరలోనే ఢీ సెట్‌లో అడుగుపెట్టబోతోన్నాడని తెలుస్తోంది. అయితే అంతకు ముందే ఓ స్పెషల్ ఈవెంట్‌లో సందడి చేయబోతోన్నాడు.

Sekhar master Grand Re Entry With Akka Evare Athagadu
Sekhar master Grand Re Entry With Akka Evare Athagadu

దసరా పండుగ సందర్భంగా ఈటీవీలో ఓ స్పెషల్ ప్రోగ్రాం రాబోతోంది. ‘అక్కా ఎవరే అతగాడు’ అంటూ చేయబోయే ఆ స్పెషల్ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో శేఖర్ మాస్టర్ దుమ్ములేపాడు. ఆయన వేసి స్టెప్పులు ఓ రేంజ్‌లో ఉంటే.. వర్షిణి, రష్మీతో కలిసి వేసిన మూమెంట్స్ అదిరిపోయాయి. ఇక ఇద్దరినీ అలా పట్టుకోవడంతో నారి నారి నడుమ మురారి అన్నట్టుగా కనిపించింది. మొత్తానికి శేఖర్ మాస్టర్ ఇలా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాడు.

Akka Evare Athagadu | ETV Dasara Special Event 2020 | Sudheer,Rashmi,Navadeep | Latest Promo