బుల్లి తెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ భాషలలో కూడా ప్రసారమవుతూ మంచి ఆదరణ పొందింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం హిందీలో 16వ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి మొదటి నుంచి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా ప్రసారం కాబోయే సీజన్ 16 కోసం సల్మాన్ ఖాన్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా 1000 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారంటూ వార్తలు రావడంతో ఈ వార్తలపై సల్మాన్ ఖాన్ స్పందించారు.ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తాను 1000 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాను అని వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం కోసం తాను వెయ్యి కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే ఐటి అధికారుల దృష్టి మొత్తం తన పైనే ఉంటుందని అలాగే 1000 కోట్లు పారితోషకం తీసుకుంటే తాను ఎలాంటి సినిమాలలో నటించాల్సిన పని లేదంటూ ఈ సందర్భంగా ఈయన తన గురించి వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.