రెండోసారి కెప్టెన్ గా రేవంత్.. బ్రెయిన్ ఉందా అంటూ మండిపడిన ఆదిరెడ్డి?

బిగ్ బాస్ ఈవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా పెద్ద ఎత్తున కంటెస్టెంట్ల మధ్య పోటీ నిర్వహించారు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా శ్రీహాన్‌, రేవంత్‌, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్‌ ఇతరుల గోల్‌ పోస్ట్‌లోకి బంతి వేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా రేవంత్‌, శ్రీహాన్‌ కలిసి ఆడినట్లే కనిపించింది. అప్పుడు ఫైమా, అందరూ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారంటాడు, మరి ఇప్పుడు ఆయన చేసింది ఏంటి అంటూ మండిపడ్డారు.

ఇక మొదటి టౌన్ లో భాగంగా రోహిత్ ఔట్ అయ్యారు రెండవ రౌండ్లో ఎవరు అవుట్ కాకపోవడంతో కంటెస్టెంట్ లో ఏకాభిప్రాయంతో ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎక్కువ భాగం ఆది రెడ్డికి ఓట్లు పడటంతో రెండవ రౌండ్లో భాగంగా ఆదిరెడ్డి బయటకు వచ్చారు. ఫైమా, రేవంత్‌ గేమ్‌ ఆసాంతం దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. రేవంత్‌ నీలాగా సపోర్ట్ తీసుకుని ఆడను అంటూ ఫైమా పై అరవడంతో వెంటనే ఆది రెడ్డి బ్రెయిన్ ఉందా బ్రెయిన్ ఎక్కడ పెట్టుకొని మాట్లాడుతున్నావు అంటూ రేవంత్ కి చురకలాంటించాడు.

ఓపక్క నాతో, అటు ఇనయతో, తీరా గేమ్‌లోకి దిగాక శ్రీహాన్‌తో కలిసి ఆడావని రేవంత్‌ కి కౌంటరిచ్చాడు. ఆదిరెడ్డి మాటలకు రేవంత్ సైలెంట్ అయ్యారు. ఇక మూడవ రౌండ్ లో భాగంగా ఇనయ తనని తాను సేవ్ చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తాను గెలవలేకపోయింది దాంతో కెప్టెన్ కాలేకపోయానని బాగా ఎమోషనల్ అయింది. చివరికి శ్రీహాన్ రేవంత్ మధ్య పోటీ ఏర్పడటంతో చివరికి రేవంత్ గెలిచి రెండోసారి కెప్టెన్ అయ్యారు. ఇలా రెండుసార్లు కెప్టెన్ కావడంతో రేవంత్ ఎంతో సంతోషంలో ఉన్నారు.