యాంకర్ రవిపై రేణు దేశాయ్ సీరియస్? ఓవర్ యాక్టింగ్ చేయకు అంటూ..?

renu desai entry in zee entertainment league

ఇది కామెడీ షోల కాలం. అవును.. బుల్లితెరపై ఇప్పుడు కామెడీ షోలను ఎంత డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం. తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లలో కామెడీ షోలకు ఉన్న ఆదరణ ఇంకే షోలకు లేదు. చివరకు బిగ్ బాస్ కూడా కామెడీ షోలకు దీటుగా ఎంటర్ టైన్ మెంట్ అందించాల్సి వస్తోంది.

renu desai entry in zee entertainment league
renu desai entry in zee entertainment league

జబర్దస్త్ తో తెలుగులో కామెడీ షోలకు ముందడుగు పడగా.. ఆ తర్వాత ఎన్నో కామెడీ షోలు వచ్చాయి కానీ.. ఏవీ నిలదొక్కుకోలేదు. తర్వాత ఇటీవల నాగబాబు జడ్జిగా జీ తెలుగులో అదిరింది కామెడీ షోను ప్రారంభించారు. అది కూడా వర్కవుట్ కాలేదు. దీంతో బొమ్మ అదిరింది అంటూ తాజాగా తీసుకొచ్చారు. అందులో శ్రీముఖిని యాంకర్ గా పెట్టారు. సుమ, అలీ, జానీ మాస్టర్ లాంటి వాళ్లను జడ్జిలుగా పెట్టారు.

కామెడీ కోసం చానెళ్లన్నీ ఎంతో కష్టపడుతున్నాయి. మళ్లీ అదే జీ తెలుగు చానెల్ జీ ఎంటర్ టైన్ మెంట్ లీగ్ 2020 పేరుతో మరో షోను తీసుకురాబోతోంది. ఆ షో ఉద్దేశం కూడా ఎంటర్ టైన్ మెంటే.

ఈ షోకు రవి, శ్యామల యాంకర్లుగా వ్యవహరించనున్నారు. అక్టోబర్ 11న ప్రారంభం కానున్న ఈ షోకు జడ్జీలుగా రేణు దేశాయ్, జానీ మాస్టర్ వ్యవహరించనున్నారు.

తాజాగా రేణు దేశాయ్ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేసింది. ఆ ప్రోమోలో రేణు దేశాయ్.. ఈ రేయి తీయనిది.. అంటూ పాటతో ఎంట్రీ ఇఛ్చింది. దీంతో సెట్ లో ఒకటే ఈలలు గోలలు.

ఆ తర్వాత యాంకర్ రవి, శ్యామల తనకు వెల్ కమ్ చెప్తారు. అయితే.. రేణుతో కలిసి ఓ చిన్న డ్రామా ఆడుతారు శ్యామల, రవి. ఆ డ్రామాలో రేణు దేశాయ్.. యాంకర్ రవి మనవరాలు. యాంకర్ రవి తాత. నువ్వు తాతవి అని అనగానే.. యాంకర్ రవి ఊగిపోవడం.. వెంటనే బ్యాక్ గ్రౌండ్ లో ముసలితాత.. ముడతమొహం అంటూ పాట రావడంతో వెంటనే రేణు దేశాయ్.. చాలు చాలు.. ఓవర్ యాక్టింగ్ అవుతోంది.. అనగానే సెట్ లో నవ్వులే నవ్వులు.

మీరు కూడా ఆ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి..