ఇమ్మానియేల్ తో పెళ్లికి సిద్ధమైన కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో 9 సంవత్సరాలుగా ప్రసారమవుతు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షోలో కామెడీతో పాటు లవ్ ట్రాక్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సుధీర్ రష్మీ మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసిన జబర్దస్త్ వారిద్దరిని లవర్స్ గా చూపిస్తూ బాగా పాపులర్ చేశారు. ఇలా సుధీర్ రష్మీ తర్వాత జబర్దస్త్ నుండి మరికొన్ని జంటలు పుట్టుకొచ్చాయి. ఇలా జబర్దస్త్ ద్వారా జంటగా ఫేమస్ అయిన వారిలో ఇమాన్యుల్ వర్ష జంట కూడా ఒకటి.

సుధీర్ రష్మీ అంత పాపులారిటీ దక్కించుకోలేకపోయినా కూడా వర్ష ఇమాన్యుల్ ప్రేక్షకులలో ప్రేమికులుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా వీరిద్దరూ ప్రేమికులుగా నటిస్తూ జబర్దస్త్ స్టేజ్ మీద చేసే స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొంతకాలం వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారా అని ప్రేక్షకులలో కూడా అనుమానం వచ్చింది. ఎందుకంటే జబర్దస్త్ స్టేజ్ మీద వీరిద్దరికీ ఏకంగా పెళ్లి కూడా జరిపించేశారు. అయితే కొంతకాలానికి వీరిద్దరూ కేవలం షో రేటింగ్స్ కోసం మాత్రమే ఇలా నటిస్తున్నారని ప్రేక్షకులకు కూడా అర్థమైంది.

ఇదిలా ఉండగా ఇమాన్యుల్ తో వర్ష మరొకసారి పెళ్లికి సిద్ధమయ్యింది. అయితే ఈ పెళ్లి జబర్దస్త్ స్కిట్ లో జరిగే పెళ్లి. ఈవారం ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్ లో ఇమాన్యుల్ స్కిట్ లో చేసిన వర్ష తనని పెళ్లి చేసుకోవటానికి ఇమాన్యుల్ కి కండిషన్ పెట్టింది. తను పెళ్లి చేసుకోవాలంటే ఇమాన్యుల్ కి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలని కండిషన్ పెట్టింది. అయితే ఇమాన్యుల్ కూడా వర్ష ని పెళ్లి చేసుకోవడానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున వంటి స్టార్ హీరోలు తెలుసు అని బిల్డప్ ఇచ్చాడు. దీంతో వారందరినీ పెళ్లికి పిలవమని వర్ష చెప్పింది. నాగార్జున, చిరంజీవి, పవన్ కళ్యాణ్ జబర్దస్త్ స్టేజ్ మీదకి పిలిపించి వారందరి చేత వర్ష తో కలిసి డాన్స్ చేయించారు.