సల్మాన్ ఖాన్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన రష్మిక..వీడియో వైరల్.?

టాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక మందన కు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అదే ఊపుతో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.

ఇకపోతే ఇటీవల రష్మిక మందన గుడ్ బై సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అందులో రష్మిక మందన తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక హిందీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో పాటు నీనా గుప్తా కూడా బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఇక హోస్ట్ సల్మాన్ ఖాన్ వారిద్దరితో కలిసి కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో కలిసి స్టేజి పై సామి నా సామి అనే పుష్ప పాటకు స్టెప్పులు వేయించింది.

రష్మిక మందన సల్మాన్ ఖాన్ ఇద్దరు కలిసి ఈ పాటకు స్టెప్పులను ఇరగదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా రష్మిక మందన ఇటీవలే రియాల్టీ షో సూపర్ మామ్స్-3 గ్రాండ్ ఫినాలే బాలీవుడ్ నటుడు గోవిందా తో కలిసి ఇదే పాటకు స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. ఇకపోతే రష్మిక మందన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో పుష్ప2తో పాటు, విజయ్‌ దళపతితో కలసి వారసుడు చిత్రాల్లో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో మిషన్‌ మజ్నూ, యానిమల్‌ చిత్రాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.