యాంకర్ అంటే ఎవరు నమ్మడం లేదు – రష్మి

బుల్లితెర మీద గ్లామరస్ యాంకర్ గా కొనసాగుతున్న రష్మి గౌతమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన రష్మి ప్రస్తుతం బుల్లితెర మీద యాంకర్ గా సందడి చేస్తోంది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేష్మి తన అందం , అభినయంతో వచ్చీ రాని తెలుగు మాట్లాడుతూ..తన ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఇక ప్రస్తుతం రష్మి జబర్థస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది. సుధీర్ శ్రీదేవీ డ్రామా కంపెనీ. అనేయటంతో రష్మి ఆ స్థానం భర్తీ చేసింది.

అయితే ఈ షో లో ఆది, రామ్ ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తూ ఈ షో ని ముందుకు నడిపిస్తున్నారు. ఇక ఈ షోలో ఆది, రాంప్రసాద్ రష్మీ మీద పంచులు వేస్తూ ఆమెని ఒక ఆట ఆడుకుంటున్నారు. అయితే రష్మి మాత్రం నవ్వుతూ వాటిని స్వీకరిస్తుంది. తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో రష్మి తనమీద తానే సెటైర్ లు వేసుకుంది. ఇక ఈ ఎపిసోడ్ లో జబర్థస్త్ అభిమానులకి ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. రామ్ ప్రసాద్ స్కిట్ చేస్తుండగా సడెన్ గా గెటప్ శ్రీను సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారందరూ గట్టిగా కేకలు వేశారు. ఇక శ్రీను అందరికి సర్ప్రైజ్ ఇచ్చి మళ్ళీ రామ్ ప్రసాద్ తో కలసి స్కిట్ చేయటానికి రెడీ అయ్యాడు.

ఇక ఈ ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ టీమ్ లో వర్ష స్కిట్ చేసింది. ఈ స్కిట్ లో వర్ష మాట్లాడుతు..నేను యాంకర్ అంటే ఎవరూ నమ్మటం లేదు అని అంటే ఇప్పటివరకూ నేను యాంకర్ అంటే నన్ను ఎవరు నమ్మటం లేదు ఇక నిన్నేం నమ్ముతారు అని రష్మి తనమీద తనే సెటైర్ వేసుకుంది. రష్మీ అలా అనగానే భాస్కర్ మీ సంగతి పక్కన ఉంచితే ఇది అమ్మాయి అంటేనే ఎవరు నమ్మటం లేదు అని వర్షం మీద కౌంటర్ వేస్తాడు. మొత్తానికి ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కలర్ ఫుల్ గా ఫుల్ కామెడి పంచ్ లతో ఉండబోతోంది.