శ్రీముఖిని ముద్దులతో ముంచెత్తిన రణవీర్ సింగ్.. ఉబ్బి తబ్బవుతున్న రాములమ్మ…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోస్ లో యాంకర్ గా సందడి చేస్తున్న శ్రీముఖి తన మాటలతో, చిలిపి చేష్టలతో ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. అంతేకాకుండా ఈ అమ్మడు తన గ్లామర్ తో కూడా ప్రేక్షకుల మనసులను దోచుకొని గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందింది. శ్రీముఖి ఇలా టీవీ షోస్ తో పాటు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

అంతేకాకుండా ఈ అమ్మడు బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో హోస్ట్ గా వ్యవహరించటమే కాకుండా సినిమా అవార్డు ఫంక్షన్ కార్యక్రమాలకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. ఇక ఇటీవల ఈ ముద్దుగుమ్మ బెంగళూరులో నిర్వహించిన సైమా అవార్డు కార్యక్రమంలో హోస్ట్ కూడా సందడి చేసింది. ఈ అవార్డు కార్యక్రమంలో శ్రీముఖి బ్లాక్ ట్రెండీ డ్రెస్సులో మెరిసిపోయింది. ఈ ఈవెంట్ లో శ్రీముఖి అలీతో కలిసి హోస్టింగ్ చేసి సందడి చేసింది.

ఇక ఈ సైమా అవార్డు కార్యక్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా ఈ ఈవెంట్ లో సందడి చేశాడు. ఈ సైమా ఈవెంట్ లో అవార్డు ఇవ్వటానికి స్టేజ్ మీదకు వచ్చిన రణవీర్ సింగ్ ని శ్రీముఖి దగ్గరకు పిలిచి అమ్మాయిలు అందరూ అసూయపడేలా మీరు ఒక పని చేయాలని చెప్పింది. దీంతో రణవీర్ సింగ్ రెచ్చిపోయి శ్రీముఖిని గట్టిగా హత్తుకొని ఆమె చేతుల మీద ముద్దుల వర్షం కురిపించాడు. ఈ పరిణామంతో రాములమ్మ ఉబ్బి తబ్బవుతోంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.