ఆది ఫోటోని కాల్చివేసిన రాంప్రసాద్.. కన్నీళ్లు పెట్టుకున్న ఆది?

బుల్లితెరపై ప్రసారమౌతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రతివారం ఏదో ఒక కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కంటెస్టెంట్లు ఆటపాటలతో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చివరిలో రష్మీ ఒక టాస్క్ నిర్వహించారు.

ఈ టాస్క్ లో భాగంగా కొందరి ఫోటోలను టేబుల్ పై పెట్టి మీకు నచ్చని వారు మిమ్మల్ని బాధ పెట్టిన వారి ఫోటోలను చింపడం లేదా కాల్చి వేయవచ్చు అంటూ చెప్పారు. ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో ముందుగా ఆటో రాంప్రసాద్ వెళ్లి తనకి హైపర్ ఆది ఒక విషయంలో వ్యక్తిగతంగా చాలా బాధ పెట్టారని చెబుతూ తన ఫోటోని ఏకంగా కాల్చివేశారు. ఇలా తన ఫోటోని కాల్చడంతో ఆది ఒకసారిగా షాక్ అయ్యాడు. అనంతరం పరదేశి వెళ్లి తనకు అన్ని హైపర్ ఆది అని అయినప్పటికీ ఒక విషయంలో మాత్రం చాలా బాధ పెట్టాడంటూ ఆయన కూడా తన ఫోటోని చింపేశారు.

ఇకపోతే రష్మీ సైతం హైపర్ ఆది ఫోటో చేత పట్టుకొని తన ఫోటోని చింపేసింది. హైపర్ ఆది వల్ల తాను కూడా హర్ట్ అయ్యానని ఈమె తెలిపారు.శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వచ్చిన మొదటి ఎపిసోడ్ రోజు హైపర్ ఆది రష్మీ ఎప్పుడు వచ్చావు అనుకోకుండా ఎప్పుడు వెళ్ళిపోతావు అంటూ తనని బాధ పెట్టారని ఈమె కారణం కూడా చెప్పింది.మొత్తానికి అందరూ కలిసి ఎంతో సరదాగా నవ్వుతూ ఉన్నప్పటికీ అందరి మనసులో హైపర్ ఆది పై ఇంత ద్వేషం ఉందని తెలియడంతో హైపర్ ఆది ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.