జబ్దర్దస్త్‌లో రచ్చ.. రాకేష్ మాస్టర్‌ను అలా వాడేస్తున్నారు!

రాకేష్ మాస్టర్ గురించి తెలియని నెటిజన్ ఉండరు. సోషల్ మీడియాలో ఒకప్పుడు సంచలన కామెంట్స్ చేసింది తెగ వైరల్ అయ్యాడు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో యేళ్ల నుంచి ఉన్నా గానీ రాని పేరు యూట్యూబ్‌ ద్వారా వచ్చింది. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఇండస్ట్రీ గుట్టు, పెద్ద హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేసి బాగా పాపులర్ అయ్యాడు. ఒకానొక సమయంలో రాకేష్ మాస్టర్ చేసిన రచ్చకు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.

Rakesh master Sepcail Appearance In Jabardasth
Rakesh master Sepcail Appearance In Jabardasth

వారు వీరు అని తేడా లేకుండా ప్రతీ ఒక్క హీరోనూ ఏకిపారేశాడు. వారసత్వ హీరోలు, వారి ఇంట్లో జరిగిన వాటి గురించి, సెట్‌లో ప్రవర్తించే విధానం గురించి ఇలా ప్రతీ ఒక్క విషయంపై మాట్లాడుతూ ఫ్యాన్స్ ఆగ్రహానికి బలయ్యాడు. అభిమాన సంఘాలు రాకేష్ మాస్టర్‌ను హెచ్చరించినా కూడా వెనక్కి తగ్గలేదు. అయితే రాను రాను రాకేష్ మాస్టర్ హడావిడి తగ్గుతూ వచ్చింది. కానీ మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాకేష్ మాస్టర్ అంటే ఓ గుర్తింపు మాత్రం వచ్చింది.

Rakesh master Sepcail Appearance In Jabardasth
Rakesh master Sepcail Appearance In Jabardasth

అలా వచ్చిన క్రేజ్ నేడు బుల్లితెరపై కనపడేలా చేస్తోంది. రాకేష్ మాస్టర్ స్టార్ మా ఈవెంట్‌లు, జబర్దస్త్ షోల్లో సందడి చేస్తున్నాడు. ఇక రాకేష్ మాస్టర్ తయారుచేయాలనుకున్న హీరో పుల్లయ్య సైతం బాగానే ఫేమస్ అయ్యాడు. ఈ ఇద్దరి మీద గతంలో జబర్దస్త్ నరేష్ స్కిట్ చేశాడు. తాజాగా రాకేష్ మాస్టరే ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ నరేష్ రాకేష్ మాస్టర్‌ను ఇమిటేట్ చేయడంతో అందరూ పగలబడి నవ్వేశారు. ఇలా రాకేష్ మాస్టర్ మొత్తానికి బుల్లితెరపై దుమ్ములేపుతున్నాడు.

Jabardasth - Jabardasth Latest Promo - 5th November 2020 - Anasuya, Hyper Aadi - Mallemalatv