మల్లెమాల వారి షోలో రచ్చ చేసిన రచ్చ రవి.. ఒక ఆట ఆడుకున్న హైపర్ ఆది!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా గుర్తింపు పొందడమే కాకుండా ఆర్థికంగా కూడా వారిని ఒక స్థాయికి తెచ్చింది. అయితే కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు మాత్రం తమకు జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ ని వదిలేసి సినిమా అవకాశాలు రావటంతో వెళ్లిపోగా.. మరి కొంతమంది మాత్రం ఇతర చానల్స్ వారు ఇచ్చే రెమ్యూనరేషన్ కి అది ఆశపడి జబర్దస్త్ కు దూరం అయ్యారు. ఇలా జబర్దస్త్ కి దూరమైన వారిలో రచ్చ రవి కూడా ఒకరు.

చాలాకాలంగా రచ్చ రవి జబర్దస్త్ లో కనిపించడం లేదు. అయితే దసరా పండుగ సందర్భంగా మల్లెమాల వారు నిర్వహించిన నవరాత్రి ధమాకా అనే స్పెషల్ కార్యక్రమంలో రచ్చ రవి సందడి చేశాడు. జబర్దస్త్ కి దూరమైన తర్వాత మాటీవీలో ప్రసారమైన కామెడీ స్టార్స్ షోలో కనిపించాడు. ఆ షో నుండి బయటికి వచ్చి తాజాగా మల్లెమాల వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

అయితే ఇలా మల్లెమాలకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన రచ్చ రవి ని హైపర్ ఆది ఒక ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో ఒక సందర్భంలో నాతో మాట్లాడాలంటే మినిమం ఐదు అడుగుల దూరం మెయింటైన్ చెయ్ అని రచ్చ రవి అనగానే… ఇలా అనబట్టే ఐదేళ్లు దూరమయ్యావు అని ఆది సెటైర్ వేస్తాడు. ఇక మరొక సందర్భంలో రచ్చ రవి స్కిట్ చేస్తూ ఈ రోజు మొత్తం శివుని పూజలో మునిగిపోయి జాగారం చేద్దాం అని అనగానే.. శివరాత్రికి నవరాత్రికి తేడా తెలియదు ఎవర్రా వీన్ని పిలిచింది? అంటూ మరొకసారి రచ్చ రవి మీద సెటైర్ వేస్తాడు.