పవన్ కళ్యాణ్ అవకాశమిస్తే ఆ పని చేయటానికి కూడా సిద్ధమే… షాకింగ్ కామెంట్స్ చేసిన వాసంతి…?

గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో కి ప్రేక్షకులలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన ఈ బిగ్ బాస్ షో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో కూడా ప్రసారమవుతు మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇటీవల ఆరవ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇక ఈ ఆరవ సీజన్లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా ఇప్పటికీ మొత్తం 11 మంది కంటెస్టెంట్లు వెలిమినేట్ అయ్యారు. తాజాగా పదవ వారంలో జరిగిన ఎలిమినేషన్స్ లో సినీ నటుడు బాలాదిత్యతోపాటు వాసంతి కూడా ఎలిమినేట్ అయ్యింది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వాసంతి ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించి నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన దగ్గరినుండి వాసంతి.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో కన్నా అందంగా రెడీ అవ్వటానికి ఎక్కువ సమయం కేటాయించేది. అందువల్ల బిగ్ బాస్ బ్యూటీ గా గుర్తింపు పొందింది. ఇలా 10 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన వాసంతి తాజాగా జరిగిన ఎలిమినేషన్ లో బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చింది.

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాసంతి ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకి రావడంతో ఆమెకు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ క్రమంలో పది వారాలపాటు తనని సపోర్ట్ చేసినందుకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే తనకి సపోర్ట్ గా నిలిచిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై పవన్ కళ్యాణ్ అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. జనసేన పార్టీ తరపున పోటీ చేసే అవకాశం వస్తే మీరు పోటీ చేస్తారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు వాసంతి స్పందిస్తూ.. నిజంగా పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని.. అంతేకాకుండా ఆయన సినిమాలో నటించే అవకాశం వచ్చిన కూడా ఆనందంగా అంగీకరిస్తానని చెప్పుకొచ్చింది. ఇలా పొలిటికల్ ఎంట్రీ గురించి వాసంతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.