వేదికపైనే ఫైమాకి రింగ్ తొడిగిన పటాస్ ప్రవీణ్.. ఆ వార్తలకు చెక్ పెట్టిన ఫైమా?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా ఎంతో మంది గుర్తింపు పొందారు. అలాంటి వారిలో పటాస్ ప్రవీణ్, ఫైమా జంట ఒకటి. పటాస్ కార్యక్రమం ద్వారా వీధిద్దరి పరిచయం ఏర్పడి అనంతరం వీరిద్దరూ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రవీణ్ కన్నా ఫైమా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరి ప్రేమలో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఫైమా జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చిన తర్వాత తనకు మరింత క్రేజ్ పెరగడంతో ఈమె ప్రవీణ్ ను పక్కన పెట్టిందని వార్తలు వచ్చాయి.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈమె గుర్తింపు రావడంతో తాను ప్రవీణ్ తో జరిగిన గొడవ కారణంగా తనతో మాట్లాడటం లేదని, తనని పూర్తిగా పక్కన పెట్టిందని వార్తలు వచ్చాయి. వీరిద్దరిని కలపడానికి జబర్దస్త్ నిర్వాహకులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలలో నిజం లేదని తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో విడుదలైన ప్రోమో ద్వారా తెలుస్తుంది. ప్రతివారం విభిన్న కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఈసారి రొమాంటిక్ కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా ఫైమా, ప్రవీణ్ ఇద్దరూ కలిసి చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇకపోతే ఇదే వేదికపైనే ప్రవీణ్ ఏకంగా ఫైమా చేతికి రింగు తొడిగి తన ప్రేమను బయటపెట్టారు. ఈ విధంగా వేదికపై ప్రవీణ్ తన చేతికి రింగ్ తోడగడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని వీరి గురించి వచ్చిన వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమేనని తెలుస్తోంది.