కార్తీకదీపం ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. డాక్టర్ బాబు ఈజ్ బ్యాక్!!

కార్తీక దీపం చూస్తున్న అభిమానులకు గత రెండు వారాలుగా ఓ వెలితి ఉంది. తమ ప్రియమైన డాక్టర్ బాబు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.. సీరియల్‌లో కనిపించడం లేదు. ఇకపై రాడేమో అని అందరూ ఆందోళన చెందారు. ఈ రెండు వారాలు ఆ నాలుగైదు పాత్రలతో నడిపించారు. సౌందర్య, శౌర్య, హిమ, వంటలక్క, మోనిత పాత్రల చుట్టే కథను నడిపించారు. ఇక డాక్టర్ బాబు రాడేమోనని అందరూ బాధపడ్డారు. అసలు ఏం జరుగుతోందంటూ డాక్టర్ బాబు ఫేమ్ నిరుపమ్‌ను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

Nirupam Paritala Back To Karthika Deepam Serial
Nirupam Paritala Back To Karthika Deepam Serial

హిమ తల్లిదండ్రులను వెతికి తీస్తుకొస్తాను.. వస్తే వాళ్లను తీసుకొనే ఇంటికి వస్తాను.. లేదంటే లేదు.. అని చెప్పి వెళ్లిపోయినా డాక్టర్ బాబు రెండు వారాలుగా సీరియల్‌లో కనిపించలేదు. ఇక హిమకు అసలు నిజం తెలిసిపోయింది. వంటలక్క, డాక్టర్ బాబే తన నిజమైన తల్లిదండ్రులు అని తెలిసిపోయింది. కానీ డాక్టర్ బాబు ఇంకా ఇంటికి రాకపోవడంతో హిమ బాధపడుతూనే ఉంది. డాక్టర్ బాబును మళ్లీ డాడీ అని పిలవాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూడసాగింది.

అయితే ఈ వారంలో డాక్టర్ బాబు గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో వదిలారు. తల్లిదండ్రులు దొరకలేదు.. ఎంతో వెతికాను అంటూ హిమ కాళ్ల మీద డాక్టర్ బాబు పడబోయాడు. ఆ ఘటనతో షాక్ అయిన హిమ దూరంగా జరిగి డాడీ అంటూ ప్రేమగా పిలిచింది. దీంతో డాక్టర్ బాబు కంట్లో నీళ్లు తిరిగాయి. మొత్తానికి నేటి ఎపిసోడ్‌లో డాక్టర్ బాబు ఫ్యాన్స్‌కు పండుగే పండుగ అన్నమాట.