బిగ్ బాస్ లేడి కంటెస్టెంట్ల అసలు రూపాలు చూసి భయపడుతున్న నెటిజన్స్… మేకప్ వేయండయ్యా అంటూ కామెంట్స్..!

ప్రేక్షకులు ఎంతకాలం ఆత్రుతగా ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు ప్రారంభమైంది. సెప్టెంబర్ 4వ తేదీ ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ శాతం బుల్లితెర నటీనటులు ఉన్నారు. బిగ్బాస్ ప్రారంభం రోజు నాగార్జున స్వయంగా అందరిని ఇంటర్వ్యూస్ చేస్తూ హౌస్ లోకి పంపించాడు. ఈ క్రమంలో అందరూ ఎంతో అందంగా తయారయి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు. సీజన్ సిక్స్ ప్రారంభమై ఇప్పటికే నాలుగు రోజులు గడిచింది. ఇక ఇప్పటికే మాస్- క్లాస్ ట్రాష్ అంటూ నాగార్జున ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ప్రతిభ ఆధారంగా బిగ్ బాస్ ముగ్గురిని సేవ్ చేసి మరో ముగ్గురిని ఎలిమినేషన్ కి నామినేట్ చేసాడు.

ఇలా ఈవారం నామినేషన్ కి సెలెక్ట్ అయిన వారిలో బాల ఆదిత్య, ఇనయా సుల్తానా, అభినయశ్రీ ఉన్నారు. ఇలా ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల్లో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వనున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారంలో ఒక లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై వారం రోజులు కూడా గడవకుండానే ఇంటి సభ్యుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నామినేషన్ ప్రక్రియలో రేవంత్ , ఫైమా మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఇదిలా ఉండేది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న లేడీ కంటెస్టెంట్ ల గురించి వారి అసలు రూపం గురించి సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో అందంగా ముస్తాబయ్యి వచ్చిన వీరు ఇంట్లోకి వెళ్లిన తర్వాత మేకప్ లేకుండా చాలా చండాలంగా కనిపిస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మేకప్ లేకుండా వారు అసలు రూపం చూసి షాక్ అయిన ప్రేక్షకులు వారిని ట్రోల్ చెస్తున్నారు. ముఖ్యంగా ఫైమా, కీర్తి భట్, గీతు రాయల్, నేహా చౌదరి, ఆరోహి రావ్ అందం గురించి విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. వారి మొహానికి కొంచం మేకప్ వేయండయ్య బాబు.. వారిని చూడలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.