పులిహోర కలపడంలో పోటీ.. శేఖర్ మాస్టర్‌కు నవదీప్ కౌంటర్ అదుర్స్

వెండితెరపై ప్రత్యేకమైన స్టెప్పులు క్రియేట్ చేసే శేఖర్ మాస్టర్‌కు.. బుల్లితెరపై శేఖర్ మాస్టర్‌కు ఎంత తేడా ఉంటుందో అందరికీ తెలిసిందే. బుల్లితెరకు వచ్చే సరికి ఆయన ఇమేజ్ ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. పులిహోర రాజా, రసికరాజా అంటూ హైపర్ ఆది, సుధీర్, ప్రదీప్ గ్యాంగ్‌లతో జతకట్టేస్తున్నారు. అయితే శేఖర్ మాస్టర్ అలా ఎంత చేసినా అది స్క్రిప్ట్ కోసం, ఈవెంట్ సక్సెస్ అవ్వడం కోసమేనని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతుంటారు.

కరోనా రావడంతో కాస్త గ్యాప్ తీసుకున్న శేఖర్ మాస్టర్ ఈ మధ్యే బుల్లితెరపై రచ్చ చేయడం ప్రారంభించాడు. అక్కా ఎవరే అతగాడు ఈవెంట్‌లో రెచ్చిపోయి పర్ఫామ్ చేశాడు. ఇక డ్యాన్సుల్లో శేఖర్ మాస్టర్‌ను కొట్టేవాడెవ్వరూ లేరు. రాములో రాముల పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. అల్లు అర్జున్ వేసిన దానికంటే బాగున్నాయ్ అని అనిపించేంతగా శేఖర్ మాస్టర్ తన స్టెప్పులతో మైమరిపించేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

కానీ రోజా ప్లేస్‌లో వచ్చిన సంగీతతోనూ పులిహోర కలిపేందుకు పొలొమని రెడీ అయ్యాడు. ఎప్పుడొచ్చినా ఎవరొచ్చినా అంటూ ఏదో డైలాగ్ చెప్పబోతోన్న శేఖర్ మాస్టర్‌కు నవదీప్ పంచ్ వేశాడు. మీది మీకు ఉంటుంది అంటూ నవదీప్ సెటైర్ వేయడంతో శేఖర్ మాస్టర్ షాక్ అయ్యాడు. ఇక సంగీతను ఫ్లర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో రోజా వాయిస్‌ను ప్లే చేయడంతో బిత్తరపోయాడు. పులిహోర కలపడంలో మీ తరువాతే ఎవరైనా అంటూ నవదీప్ శేఖర్ మాస్టర్ పరువు తీసేశాడు.

Akka Evare Athagadu Latest Promo 03 - #Dasara Special Event - Sangeetha,Varshini,Sudheer,Navdeep