నవదీప్ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. అయితే ఆ పోస్ట్ నాగబాబు పెట్టిన పోస్ట్‌కు దగ్గరగా ఉండటంతో వివాదం మొదలైంది. బొమ్మ అదిరింది వివాదం గురించి అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ హరి, రియాజ్ అనే వాళ్లు స్కిట్ చేయడం, అది ఏపీలో చిచ్చు పెట్టింది. క్షమించమని వైఎస్ జగన్ అభిమానులను వాళ్లు వేడుకోవడం కూడా జరిగింది. ఈ వ్యవహారంలో నాగబాబు వేసిన సెటైర్లు మాత్రం అగ్గిని రాజేశాయి.
సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టిన ఫోటోను షేర్ చేస్తూ బొమ్మ అదిరింది అంటూ సెటైర్ వేశాడు. ఇక ఈ పోస్ట్‌పై జగన్ అభిమానులు విరుచుకుపడ్డారు. ఓ వైపు ఈ వివాదం కొనసాగుతూ ఉంటే నవదీప్ వేసిన పోస్ట్ మరింత అగ్గిని రాజేసింది. నవదీప్ కూడా ఇలాంటి ఓ వివాదాస్పద పోస్టే పెట్టాడు. కుక్కను సింహాసనం ఎక్కిస్తే అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టేశాడు. అయితే ఈ పోస్ట్ చూసిన జగన్ అభిమానలు నవదీప్‌ను గట్టిగా వేసుకున్నారు.
దీంతో దెబ్బకు దిగొచ్చిన నవదీప్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఆ పోస్ట్ వైఎస్ జగన్‌ను ఉద్దేశించి కాదని తెలిపాడు. జగన్ గారు ఆంధ్రా సీఎం. దాని అర్థం ఆయన ఎన్నికల్లో గెలుపొందారు.. అంటే.. జనాలు ఆయన్ను ఎన్నుకున్నారు. అలాంటప్పుడు నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నా మూర్ఖత్వమే అవుతుంది.. అలా నేను మాట్లాడతానని అనుకుంటే కూడా అది మీ మూర్ఖత్వమే అవుతుంది. బాబు గారు ఏం మాట్లాడారో నాకు తెలీదు..నాకంటే ముందు ఆయన ఏం ట్వీట్ చేశాడో కూడా నాకు తెలీదు అంటూ వివాదానికి ముగింపు పెట్టే ప్రయత్నం చేశాడు.