అనసూయ పై ఆగ్రహం వ్యక్తం చేసిన నందు.. తులసి పై నిందలు వేసిన లాస్య!

కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్న గృహలక్ష్మి సీరియల్ రోజు రోజుకు మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. జీవితంలో ఒంటరి మహిళ తనకు ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొని జీవితంలో ఎలా పోరాటం చేస్తుందనే నేపథ్యంలో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా తన తండ్రిని తన తల్లి అవమానించిందని తెలుసుకున్న నందగోపాల్ తన తండ్రి పట్ల ఎంతో ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.

దేవుడు లాంటి మా నాన్నను ఆనరానీ మాటలన్నీ అని నా ఇంటికి దూరం చేశారు అంటూ బాధపడుతూ ఉండగా ఈ విషయాలన్నీ కూడా తులసి అనసూయ బయటనుంచి వింటూ ఉంటారు.అనసూయను తులసి లోపలికి తీసుకెళ్తుండగా మా నాన్న లేని ఇంట్లో అడుగుపెట్టడానికి వీలు లేదమ్మా నువ్వు తక్షణమే ఇల్లు విడిచి వెళ్ళిపో అని తన తల్లిని ఇంట్లోకి రానివ్వరు.నాన్న ఇంట్లోకి అడుగుపెట్టే వరకు నీకు కూడా అడుగుపెట్టే అవకాశం లేదు అంటూ చెప్పడమే కాకుండా తులసిని వెళ్లిపొమ్మని చెప్పు, ఆమె ఈ ఇంటి మనిషి కాదు పరాయి మనిషి అంటూ సీరియస్ అవుతాడు.

నందు మాట్లాడుతూ ఆమె నుంచి అడగాల్సినవి తెలుసుకోవాల్సినవి ఏమీ లేవు అంటూ ఉండగా వెంటనే తులసి అత్తయ్య గారు మామయ్యను తీసుకురావడం కోసమే వెళ్లారు అని సమాధానం చెబుతుంది ఎలా వస్తారు నా అనుకున్న వాళ్ళందరూ తనని దారుణంగా మోసం చేసి అవమానిస్తే అవమానాన్ని తట్టుకొని తిరిగి ఎలా వస్తారు అంటు నందు సీరియస్ అవుతాడు. ఈ విధంగా నందు సీరియస్ కావడంతో అనసూయ భయపడుతుంది. దేవుడు లాంటివి మా నాన్నను అన్ని మాటలు అవమానించినందుకు వేరే వాళ్లంటే ఈపాటికి చంపేసేవాన్ని.

ఇలా నాన్నను అన్నది నువ్వై బతికి పోయావు. నీ కడుపున పుట్టినందుకు నేను ఆ పని చేయలేకపోతున్నాను అంటూ అనసూయ పట్ల నందు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు పరంధామయ్య సామ్రాట్ వాళ్ళందరూ కలిసి తులసి ఇంకా రాలేదు అక్కడ ఏమి గొడవ జరుగుతుందోనని కంగారు పడుతూ ఉండగా వెంటనే నాన్నకు విషయం మొత్తం తెలిసిపోయింది అంటూ సామ్రాట్ కు మెసేజ్ చేస్తారు. దీంతో సామ్రాట్ పరంధామయ్య ఏం గొడవ జరుగుతుందోనని కంగారు పడుతూ ఉంటారు.

ఇక నందు అనసూయ తులసి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా తులసి మామయ్య గారు నా వద్ద క్షేమంగా ఉన్నారని చెప్పడంతో నందగోపాలు తులసికి థాంక్స్ చెప్తాడు ఇక పనిలో పనిగా లాస్య తులసిపై లేనిపోనివి చెబుతూ తనపై నిందలు వేస్తుంది.అత్తయ్య గారిని అడ్డం పెట్టుకొని తులసి అన్ని ఆటలు ఆడుతుంది అంటూ లాస్య మాట్లాడగా నేను లోకం మాటలు పట్టించుకోవడం మానేసి చాలా రోజులు అవుతుంది.లాస్య మామయ్యను అత్తయ్యను అడ్డుపెట్టుకొని మన కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తుంది అంటూ లేనిపోని నిందలు వేయడంతో అందరి ముందు లాస్యకి తులసి తనదైన స్టైల్ లో బుద్ధి చెబుతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.