ఇమ్ము కాదన్న రోజే నా ఊపిరి ఆగిపోతుంది.. వైరల్ అవుతున్న వర్ష కామెంట్?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ప్రతివారం ఈ కార్యక్రమం రెండు రోజుల ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా గెటప్ శ్రీను యముడి గెటప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ స్కిట్ లో ఆటో రాంప్రసాద్ ఇమ్మానియేల్, వర్ష జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ వంటి వారు పెద్ద ఎత్తున సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా గెటప్ శ్రీను యముడు పాత్రలో ఉండగా భూలోకంలో తప్పులు చేస్తున్నటువంటి రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత, వర్ష ఇమ్మానియేల్ ను నరకానికి తీసుకువెళ్తారు.

నరకంలో ఇమ్మానుయేల్ వర్షా జోడిలకు శిక్ష విధించాలని గెటప్ శ్రీను భావించగా వెంటనే ఆటో రాంప్రసాద్ వీరిద్దరూ చాలా డేంజరస్ అని అంటారు.ఆటో రాంప్రసాద్ అలా చెప్పేసరికి గెటప్ శ్రీను కూడా అవును వీళ్లిద్దరు చాలా డేంజర్ గా ఉన్నారంటూ అందరినీ నవ్విస్తారు. నేను విధించే శిక్ష నుంచి మీరు తప్పించుకోవాలంటే ఒక టాస్క్ చేయాలని చెప్పారు. ఇమ్మానుయేల్ పై తనకున్న ప్రేమ నిజమని నిరూపించుకోవాలని చెబుతారు.

ఈ క్రమంలోనే వర్ష ఇమ్మానియేల్ తో మాట్లాడుతూ.. ఇమ్ము అందరికీ ఓ డౌట్ ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అనే డౌట్ అందరిలోనూ ఉంది అందరికీ మనం చెప్పే సమాధానం ఏంటంటే.. ఇమ్ము కాదన్న రోజు నా ఊపిరి ఆగిపోతుంది అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇలా ఈమె ఇమ్మానియేల్ గురించి మరోసారి తన ప్రేమను బయటకు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇమ్మానుయేల్ అయితే పట్టారని సంతోషంలో ఉండిపోయారు. మొత్తానికి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.