పెళ్ళికూతురుగా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ..? వైరల్ అవుతున్న హల్దీ ఫొటోస్…!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో సాయి తేజ కూడా ఒకరు. జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసి మంచి గుర్తింపు పొందిన సాయి తేజ ఆ తర్వాత సర్జరీ చేయించుకుని తన జెండర్ మార్చుకుని ప్రియాంక సింగ్ గా తన పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ మంచి గుర్తింపు పొందిన ప్రియాంక సింగ్ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో మానస్ తో కలిసి ప్రేమ పెళ్లి అంటూ ప్రియాంక చేసిన సందడి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ ద్వారా ప్రియాంక పాపులారిటీ మరింత రెట్టింపు అయిందని చెప్పడంలో సందేహం లేదు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రియాంక తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ప్రియాంక సింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన తల్లిదండ్రులతో కలిసి పూజలో పాల్గొన్న ప్రియాంక ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా ఇటీవల ప్రియాంక హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . దీంతో ప్రియాంకకి పెళ్లి ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో కూడా ప్రియాంకకి పెళ్లి జరిగినట్లు వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ప్రియాంక నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ ఆ వార్తలకు చెక్ పెట్టింది. అయితే ఇప్పుడు ప్రియాంక సింగ్ కి సంబంధించిన హల్ది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రియాంక పెళ్లి చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఈ వార్తలపై ప్రియాంక సింగ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.