కార్తీక దీపంలో మోనిత రీ ఎంట్రీ..? విషయం లీక్ చేసిన లేడీ విలన్…?

బుల్లితెర మీద ప్రసారమంతున్న కొన్ని టీవీ సీరియల్స్ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అలా టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయిన టీవి సీరియల్స్ లో కార్తీక దీపం సీరియల్ కూడా ఒకటి . మా టీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎన్నో సంవత్సరాలుగా టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఈ సీరియల్ లోని కార్తీక్, దీప పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సీరియల్ లో మరొక పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్లో మోనిత అనే నెగటివ్ రోల్ కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరkaయింది. అయితే స్టోరీ డిమాండ్ చేయడంతో ఈ సీరియల్ లో కార్తీక్ , దీప పాత్రలను చంపేశారు.

ప్రస్తుతం ఈ సీరియల్ లో కొత్త జనరేషన్ సందడి చేస్తోంది. హిమ, శౌర్య పాత్రలు పెద్దవాళ్ళు అయ్యారు. అయితే ఈ సీరియల్ లో ఇప్పుడు కార్తీకదీపం మౌనిత క్యారెక్టర్ లో లేకపోవడంతో ఈ సీరియల్ రేటింగ్స్ పడిపోయాయి. ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ చూడటానికి ఆసక్తి చూపటం లేదు. ఈ సీరియల్ లో కార్తీకదీపం రీఎంట్రీ ఇస్తే సీరియల్ మునుపటిలా మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. కాకపోతే ఈ సీరియల్లో కార్తీక్ దీప పాత్రలు చనిపోవటంతో వారు రీఎంట్రీ ఇచ్చే అవకాశం. కొన్ని సీరియల్స్ లో చనిపోయిన వారు కూడా తిరిగి వస్తున్నారు. కానీ ఈ సీరియల్లో పెద్దవాళ్ళు అయిన పిల్లలకు తల్లిదండ్రులుగా నటించడానికి వారూ జుట్టుకి తెల్లరంగు వేసుకోవలసి వస్తుంది. అందువల్ల వారు ఈ సీరియల్ లో నటించటానికి ఆసక్తి చూపటం లేదు.

ఇక మోనిత ఈ సీరియల్ లో నటించటానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ నటించాలా? వద్దా? అని సందిగ్ధంలో ఉంది. ఇటీవల మోనిత కార్తీక దీపం సీరియల్ సెట్ లో సందడి చేసింది. దీంతో మెనిత మళ్ళీ కార్తీక దీపం సీరియల్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల మోనిత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కార్తీక దీపం సీరియల్ లో రీ ఎంట్రీ గురించి స్పందిస్తు ఒక వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో మోనిత కార్తీకదీపం సీరియల్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు హింట్ ఇచ్చింది. ఈ వీడియోలో మోనిత మాట్లాడుతూ.. చాలామంది అభిమానులు కార్తీకదీపం సీరియల్ లో ఎప్పుడు రిఎండ్రీ ఇస్తారు అని అడుగుతున్నారు నాకు కూడా సీరియల్లో మళ్లీ నటించాలని ఉంది. ఈ విషయంలో తొందర్లోనే మీకు ఒక క్లారిటీ ఇస్తాను అంటూ మోనిత ఈ వీడియోలో వెల్లడించింది.