దీపకు తన గుండె ఇస్తానన్న మోనిత…. మోనిత మాటలకు షాక్ లో కార్తీక్!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… కార్తీక్ మోనిత రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అయితే అదే సమయంలో కార్తీక్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటూ చెప్పగా ఏంటి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా ముందు ఆ పని చెయ్యి నీకు శతకోటి వందనాలు పెడతాను అంటూ సమాధానం చెబుతాడు. నువ్వు పిలిచినా వినపడినంత దూరం వెళ్ళిపోతాను కార్తీక్ అంటూ మోనిత సమాధానం చెబుతుంది. అయితే దీప మరి కొద్ది రోజులలో చనిపోతుంది తనని కాపాడుతాను, నేను దూరంగా వెళ్లి నా గుండె చప్పుడు నువ్వు వినేలా చేస్తాను అనడంతో కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తాడు.

దీప బతకాలి అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పడంతో ఇప్పటికిప్పుడు గుండె దొరకాలి కదా అని కార్తీక్ మాట్లాడుతారు. దీప బ్రతకాలి అంటే నేను చావాలి నా గుండెను తీసి దీపకు పెట్టు కార్తీక్ అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎలాగో నువ్వు నా సొంతం కాలేదు కానీ నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు అందుకే నేను దూరమైనా నా గుండె చప్పుడు ఎప్పుడు నీకు దగ్గరగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ మాట్లాడుతుంది.అయితే నువ్వు దీప గురించి ఇలా మాట్లాడుతున్నావు అంటే మరొక ఏదో కొత్త ప్లాన్ చేసే ఉంటావు నేను నీ మాటలు నమ్మను అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు హేమచంద్ర దీప ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉండగా సౌందర్య అక్కడికి వస్తుంది అయితే దీప మాత్రం అన్నయ్య లేకపోతే నేను బ్రతికే దాన్ని కాదు అంటూ సమాధానం చెబుతుంది. నాకు తెలుసు మీరు అంతా ముందే కలుసుకున్నారని కానీ నేను వీళ్ళ ఫోటో చూపించినప్పుడు హేమచంద్ర మాత్రం నాకు తెలియదని సమాధానం చెప్పాడు. ఎందుకు మా దగ్గర నిజం దాచారు అని సౌందర్య అనడంతో ఇప్పటికైనా కలుసుకున్నారు కదా అని హేమచంద్ర అంటాడు. అయితే అదే సమయంలో కార్తీక్ అక్కడికి రావడంతో నువ్వేమి తెలియనట్టు చూడకు దీప అంతా చెప్పింది అంటూ సౌందర్య మాట్లాడుతుంది.

మరోవైపు పిల్లలు వచ్చి భోగి మంటలు వేయడానికి పాత కలప కావాలి అని చెబుతారు. ఈ సమయంలో బోగి మంటలు ఏంటి వేడి కదా అని కార్తీక్ అనడంతో వేడి కోసమే భోగిమంట లేస్తారు కదా అంటూ సౌందర్య మాట్లాడుతుంది. దీప ఈ భోగి మంటలు సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని కార్తీక్ తనకు చెబుతాడు. మరోవైపు సౌందర్య చంద్రమ్మ దీప పిండి వంటలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి దీపమ్మ మీరు పక్కకు లేయండి అని చెప్పగా అసలు దీపను ఏమనుకుంటున్నావు నువ్వు దాని పేరే వంటలక్క ఇలాంటి వంటలన్నీ ఎలా చేస్తుందో నీకు తెలియదు అనడంతో ఇన్ని రోజులు పిల్లలకు దీపమ్మ చేసి పెట్టింది ఇప్పుడు ఆ అవకాశం నాకు ఇవ్వండి అంటూ చంద్రమ్మ మాట్లాడుతుంది.

మీ వాళకం చూస్తుంటే దీపా ఏదో సమస్యతో బాధపడుతుంది తనకుపొగ తగలకూడదని మాట్లాడుతున్నట్టున్నారే అని అనడంతో అందరూ షాక్ అవుతారు. మరోవైపు హేమచంద్ర కార్తీక్ ఇద్దరు కూడా దీప గురించి ఇంట్లో చెప్పాలంటే భయం వేస్తుంది అనడంతో హేమచంద్ర దీపను నీ కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు ఈ విషయం అంత జరిగిన తర్వాత తెలిసే కన్నా ముందుగా చెప్పడమే మంచిది అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది తర్వాత ఎపిసోడ్లు దీప ఎలాగైనా నన్ను బతికించండి డాక్టర్ బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు కార్తీక్ కు మోనిత చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.