భోగి మంటల పై నీళ్లు చల్లిన మోనిత…. మోనిత జుట్టు పట్టుకొని రగిలిపోయిన దీప!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… దీప తన అత్తయ్య చంద్రమ్మతో కలిసి పిండి వంటలు చేస్తుంది. అదే సమయంలో కార్తీక్ తనని పిలిచి నీకు ఎన్నిసార్లు చెప్పాను వీడికి వెళ్ళవద్దని మరి ఎందుకు ఈ వంటలు చేస్తున్నావని అడగడంతో పిల్లలు నోరార అడిగారు అందుకే చేస్తున్నాను అని చెబుతుంది. నీకు వేడి తగలకూడదని తెలుసు కదా అమ్మ అటు హేమచంద్ర కూడా చెబుతాడు. ఇలా వీరి ముగ్గురి మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా దీప మాత్రం నేను బ్రతికే అవకాశం లేదా డాక్టర్ బాబు.. నన్ను ఎలాగైనా బ్రతికించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ సమయంలో మోనిత చెప్పిన మాటలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు.

అంతలోపు పిల్లలు వచ్చి దీపని భోగిమంటల వద్దకు తీసుకువెళ్తారు. ఇక దీప భోగి మంటలు వెలిగించి అందరూ సంతోషంగా ఉండగా మోనిత వచ్చి భోగిమంటలపై నీళ్లు వేస్తుంది.ఈ దీప కార్తీక్ పక్కన లేకపోతే ఈ సంతోషమంతా నాది భోగిమంటలు నేనే వెలిగించేదాన్ని అంటూ మాట్లాడుతుంది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకున్న దీపా ఏకంగా తన జుట్టు పట్టుకొని ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా ఈ భోగి మంటలలో వేసి తగలబెడతాను అంటూ మోనితకు వార్నింగ్ ఇస్తుంది.అంతలోపే కార్తీక్ వచ్చి దీపను లోపలికి తీసుకు వెళ్తాడు పిల్లలు కూడా అక్కడి నుంచి అలిగి వెళ్లి పోతారు.

ఇకపోతే కార్తీక్ హేమచంద్ర నడుచుకుంటూ వెళుతుండగా హేమచంద్ర మంచే జరిగింది దీప వేడికి ఉండకూడదు అంటూ మాట్లాడుతారు. అదే సమయంలో మోనిత అదేంటి కార్తీక్ నేను చేసిన పనికి నాకు థాంక్స్ చెబుతావు అనుకుంటే ఏం మాట్లాడలేదు అనడంతో నీకెందుకు థాంక్స్ చెప్పాలి అనగా ఇప్పుడు దీప ఉన్న పరిస్థితులకు తనకు వేడి తగలకూడదు అందుకే నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదని భోగి మంటలపై నీళ్లు చల్లాను అని మాట్లాడుతుంది. ఇలా దీప పైప్రేమ ఉన్నట్టు నటిస్తూ కార్తీక్ ను తన వైపుకు తిప్పుకోవాలని కుట్ర చేస్తోంది మోనిత.

ఇక మోనిత తనకు ఇచ్చిన ఆఫర్ గురించి కార్తీక్ హేమచంద్ర దగ్గర ప్రస్తావిస్తాడు.మరోవైపు పిల్లలు ఆమోనిత మనల్ని పండుగ కూడా జరుపుకొనివ్వదు తనని ఇక్కడికి రాకుండా చూడండి తనపై పోలీసు కేసు పెట్టండి నాన్నమ్మ అనడంతో దీప అది మన జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని చెబుతుంది. ఇక హేమచంద్ర దీప విషయం ఇంట్లో చెప్పమని కార్తీక్ కు సలహా ఇస్తారు. అయితే కార్తీక్ మాత్రం దీపను బ్రతికించడం కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నా తరుణంలో పదేపదే మోనిత మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు.