హైపర్ ఆదిని ఓ రేంజ్ లో ఆడుకున్న మెగా డాటర్.. చాలా కష్టం అంటూ నిజం ఒప్పుకున్న ఆది!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈమె ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుందని చెప్పాలి. ఇకపోతే నిహారిక బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన ఈమె అనంతరం హీరోయిన్ గా పరిచయమయ్యారు. వెండితెరపై ఈమె పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయిందని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి నిహారిక తన కొత్త వెబ్ సిరీస్ హలో వరల్డ్ ప్రమోషన్ కోసం వచ్చారు.

నిహారిక వచ్చి రావడంతోనే హైపర్ ఆది పై తనదైన శైలిలో పంచులు వేస్తూ ఆది నోరు మూయించింది. హైపర్ ఆది నిహారిక ఎంట్రీ ఇవ్వగానే ఆమె శంకర్ దాదా నేను ఏటీఎం అంటూ పరిచయం చేసుకున్నారు. అయితే అది ఇలా పరిచయం చేసేసరికి నిహారిక ఏంటి అది అందరిని దా దా అని పిలిచి నన్ను మాత్రం దాదా అంటున్నావు అంటూ తనపై పంచ్ వేసింది. నిహారిక ఇలాంటి పంచ్ వేయడంతో గమ్మున అవుతాడు. ఇకపోతే నిహారిక ఆదిని మరో ప్రశ్న వేస్తూ ప్రపంచంలో అతి కష్టమైంది ఏది అని అది నీ ప్రశ్నిస్తుంది.

ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ పంచులు వేసే వాడి మీద ఇలా పంచులు వేస్తుంటే తీసుకోవడం చాలా కష్టం అంటూ సమాధానం చెప్పారు. ఈ విధంగా మెగా డాటర్ దెబ్బకు ఆది తోక ముడిచాడనే చెప్పాలి.ఇక నిహారిక తన ముందు ఎవరన్న డోంట్ కేర్ అన్నట్టు తనదైన శైలిలో ఇతరులపై పంచ్ వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.ఇక ఈ కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ అంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.