ఈ వారం బిగ్ బాస్ షో నుండి కమెడియన్ కుమార్ సాయి ఎలిమినేట్ అవుతున్నట్టు తెలిసింది. కుమార్ సాయి కు ప్రతి వారం ఫాలోయింగ్ పెరుగుతుందే తప్ప తరగడం లేదు. అందులోనూ అతను ఎప్పుడు డేంజర్ జోన్ లో కూడా లేడు. అయితే ఈ వారం కుమార్ సాయి ఎలిమినేట్ అవుతాడు అనే వార్త మాత్రం బిగ్ బాస్ ప్రేక్షకులకు కచ్చితంగా షాకింగ్ వార్తే అవుతుంది.
తొలి రోజుల్లో కుమార్ సాయి కొంచెం డల్ గా ఉన్నపటికీ తర్వాత వారాల్లో టాస్క్ ల సమయంలో బాగానే కష్టపడేవాడు. చివరి ఐదు మందిలో కుమార్ సాయి ఉంటాడు అనుకునే స్థాయి కి చేరాడు.
ఆశ్చర్యకరంగా, బిగ్ బాస్ అతన్ని ఇంటికి పంపించారు అని తెలుస్తుంది. అయితే ఇది కుమార్ సాయి కి వచ్చిన ఓట్లు ప్రాతిపదికన జరగలేదు అని తెలుస్తుంది.
వాస్తవానికి మోనాల్ గజ్జార్ కు అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయట .అయితే బిగ్ బాస్ కు ఇంకో మహిళా పోటీదారునికి బయటకు పంపడం ఇష్టం లేక కుమార్ సాయి ని బయటకు పంపించారట.
సూర్య కిరణ్ మినహా, బహిష్కరించబడిన పోటీదారులందరూ ఆడవారు కావడంతో బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ ఈ సమయంలో మరొక ఆడవారిని బయటకు పంపించటానికి ఇష్టపడలేదు.
బిగ్ బాస్ ఇంట్లో లింగ సమతుల్యతను కాపాడటానికి రాబోయే రెండు ఎలిమినేషన్స్ కూడా ఈ విధంగానే జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది .