బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇకపోతే నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే కార్తీక్ చారుశీల కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా ఈమె మాత్రం తనకి ఏమీ తెలియనట్టు నువ్వేం టెన్షన్ పడకుండా హాస్పిటల్ కి తీసుకురా కార్తీక్ అని చెబుతుంది. కార్తీక దీపం హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత చారుశీల మనసులో నేను అనుకున్నదే జరుగుతుంది. మోనిత మేడం రెండు సంవత్సరాలుగా చేయలేనిది నేను రెండు రోజుల్లో చేస్తున్నాను మరి కొంత సమయంలో దీప పైకి పోవడం ఖాయం మీరు జైల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అని మనసులో అనుకుంటుంది.
అనంతరం ఈమె దీపను చెక్ చేస్తూ నిన్ను ఒకేసారి పైకి పంపియవచ్చు కానీ నీ మొగుడు డాక్టర్ కావడంతో స్లోగా నిన్ను పైకి పంపిస్తున్నాను అంటుంది.నువ్వేం టెన్షన్ పడకు కార్తీక్ ఆపరేషన్ కి మొత్తం సిద్ధమైంది మనకు గుండె దొరుకుతుంది అంటూ మాట్లాడుతుంది. గట్టిగా మాట్లాడకు దీప వింటుంది అని కార్తీక్ చెప్పడంతో దీప మెలకువలో లేదని అబద్ధం చెబుతుంది.దీప ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండదు అనే విషయం తనకు తెలియకూడదు చారుశీల అంటాడు. ఇక దీప వైపు చూస్తూ సంతోషంగా ఉన్న రోజులను మనం వేళ్లపై లెక్క పెట్టవచ్చు అంటూ బాధపడతాడు.
ఒకప్పుడు ఆ మోనిత ఇచ్చిన రిపోర్ట్స్ కారణంగా నేను తనని 10 సంవత్సరాలు దూరం పెట్టాను.తర్వాత యాక్సిడెంట్ లో గతం మర్చిపోయాను గతం గుర్తుకు వచ్చిన తర్వాత అయినా సంతోషంగా ఉందామనుకుంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది అని బాధపడతాడు.నువ్వు చాలా మంచోడివి కార్తీక్ అప్పుడు మోనిత ఇచ్చిన రిపోర్ట్స్ నమ్మావు ఇప్పుడు నేను ఇచ్చిన రిపోర్ట్స్ నమ్మావు అంటూ మనసులో సంతోషపడుతుంది చారుశీల.ఇక కార్తీక్ దీప పరిస్థితి తెలుసుకొని ఏడుస్తూ ఒకటి నుంచి వెళ్ళిపోతా.డు దీప జరిగినది మొత్తం విని మనసులో బాధపడుతూ కన్నీళ్లు కారుస్తుంది.
మరోవైపు కార్తీక్ శౌర్య కోసం రాసించిన ప్రిస్క్రిప్షన్ చూసిన సౌందర్య ఇది నా కొడుకు చేతిరాత అని సంతోషపడి ఇంద్రుడిని పిలుస్తుంది.అంతలోపు శౌర్య అక్కడికి వచ్చి ఇది చారుశీల మేడం రాసించిన ప్రిస్క్రిప్షన్ టెస్టులు చేయించమని రాసించారు అని చెప్పడంతో లేదు ఇది కార్తీక్ చేతిరాత అంటూ మాట్లాడుతారు.అంతలో హిమ అక్కడికి వచ్చి ఇది ఖచ్చితంగా డాడీ రాసినదే ఈ చేతిరాత డాడీదే అంటూ మాట్లాడుతారు. అయితే ఇంద్రుడు రావడంతో సౌందర్య తనని నిలదీస్తుంది.ఇది ఎవరి రాసారో నాకు తెలియదు మేడం నాకు మాత్రం చారుశీలమ్మ ఇచ్చారు అని ఇంద్రుడు చెబుతాడు.
సౌందర్య నీతో మాట్లాడాలి బయటకు వెళ్దాం అని చెప్పగా చంద్రమ్మ ఇంద్రుడితో మాట్లాడుతూ వాళ్లకి మనపై అనుమానం వచ్చింది ఎలాగైనా నీతో నిజం చెప్పించాలని చూస్తున్నారు గండ అని చెబుతుంది.ఇక కార్తీక్ దీపను ఇంటికి తీసుకెళ్లగా నువ్వేం భయపడకు దీప అని ధైర్యం చెబుతాడు కానీ దీప మాత్రం మనసులో తన ఆరోగ్యం బాగాలేదని మరికొన్ని రోజుల్లో నేను చనిపోబోతున్నానని తలుచుకొని ఏడుస్తుంది. ఇక దీంతో పండరి ఇకపై నేనే వంట చేస్తాను అని చెప్పడంతో కార్తీక్ వద్దంటాడు దాంతో పండరి చేయనివ్వండి బాబు ఉన్నన్ని రోజులైనా తన భర్తను బాగా చూసుకోవాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది అని చెబుతుంది.
నేను ఉన్నన్ని రోజులు నా భర్తను సంతోషంగా చూసుకోవాలి అని దీప మనసులో అనుకుంటుంది. మరోవైపు సౌందర్య ఇంద్రుడును ప్రశ్నిస్తూ కార్తీక్ వాళ్ళు బ్రతికే ఉన్నారని నాకు తెలుసు ఆ విషయం నీకు కూడా తెలుసు కావాలనే వాళ్ళు మానించి దూరంగా వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ తనని నిలదీస్తుంది కార్తీక్ మాత్రం మీ కొడుకు కోడలు గురించి నాకు తెలియదు అయినా చనిపోయిన వాళ్ళు ఎలా బతికి వస్తారు అంటూ చెప్పినప్పటికీ సౌందర్య మాత్రం నమ్మదు.