విజయ్ దేవరకొండను చూసి అది నేర్చుకుందట.. సీనియర్ హీరోయిన్ మామూల్ది కాదు!!

విజయ్ దేవరకొండ అంటే కేవలం టాలీవుడ్‌లోనే కాదు మొత్తం సౌత్‌లోనే క్రేజీ స్టార్. టాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాలు చేశాడు. నోటా చిత్రంతో కోలీవుడ్‌లోనూ పరిచమయ్యాడు. డియర్ కామ్రేడ్ సినిమాతో ఏకంగా సౌత్ మొత్తాన్ని పలకరించాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఉత్తరాదిన కూడా ఫేమస్సే. కానీ ఇంత వరకు నేరుగా ఒక్క హిందీ చిత్రాన్ని కూడా చేయలేదు. త్వరలోనే ఈ రౌడీ ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదగబోతోన్నాడు.

Kasthuri Shankar About Vijay Devarakonda In Suma Cash Show
Kasthuri Shankar About Vijay Devarakonda In Suma Cash Show

అయితే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో తమిళులను కూడా ఫిదా చేసేశాడు. ఈ మూవీలో అమ్మాయిలకు ఫేవరేట్ అయిపోయాడు. కేవలం అమ్మాయిలకు మాత్రమే ఓ సీనియర్ నటిని కూడా పడేశాడు. అన్నమయ్య చిత్రంలో నటించిన కస్తూరీకి విజయ్ అంటే మహా పిచ్చి. ఆ మధ్య అలీతో సరదాగా అనే షోలో వచ్చినప్పుడు కూడా విజయ్ పేరు ఎత్తగానే అంత ఎత్తున లేచింది.విజయ్ పేరు వింటేనే ఏదో వైబ్రేషన్స్ వచ్చినట్టైంది.

Kasthuri Shankar About Vijay Devarakonda In Suma Cash Show
Kasthuri Shankar About Vijay Devarakonda In Suma Cash Show

విజయ్ పక్కన తల్లిగా, సోదరిగా చేయనని భార్యగా చాన్స్ వస్తే చేస్తానని చెప్పుకొచ్చింది. తాజాగా కస్తూరీ సుమ క్యాష్ షోలో వచ్చింది. ఈ షోలో కస్తూరీ విజయ్ గురించి చెప్పి ఫుల్ ఎగ్జైట్ అయింది. కేవలం విజయ్ వల్లే తెలుగు నేర్చుకుందట. అర్జున్ రెడ్డి చిత్రంతోనే తెలుగు నేర్చుకుందట. విజయ్ అంటే అంత పిచ్చి అని చెప్పింది. కానీ ధోనితో పోల్చినప్పుడు ధోని అంటేనే ఎప్పటికీ ఇష్టమని చెప్పింది.

Cash Latest Promo - 24th October 2020 - Shobha Shetty, Kasthuri, Rajitha, Meena Kumari - Mallemalatv