అందరిముందు గెటప్ శ్రీను పరువు తీసిన కాకుల ఆంటీ..గెటప్ శ్రీను ఎవడంటూ కామెంట్!

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంత మంచి గుర్తింపు పొందిందో అందరికీ తెలిసిన విషయమే. జబర్థస్త్ షో ప్రారంభంలో మంచి కంటెంట్ తో స్కిట్లు చేసేవారు. కానీ ఇప్పుడు జబర్థస్త్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ స్కిట్ లో చూసినా కూడా డబుల్ మీనింగ్ డైలాగులే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం జబర్థస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చిన గెటప్ శ్రీను మళ్లీ తన గెటప్స్ తో అదరగొడుతున్నాడు. తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్ లో కూడా కొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ఫేమస్ అవుతూ ఉంటారు.

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన లోకులు కాకులు ఆంటీ సినిమా థియేటర్ల వద్ద రివ్యూలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యింది.కాకుల ఆంటీ నోరు తెరిస్తే చాలు బూతులు మాట్లాడుతుంది. ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్థస్త్ ఎపిసోడ్ లో కాకుల ఆంటీ గెటప్ తో శ్రీను ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో గెటప్ శీను కాకుల ఆంటీ గెటప్ వేసుకుని ఎంట్రీ ఇవ్వగానే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా విజిల్స్ వేస్తూ రచ్చ చేశారు. అలాగే శ్రీను కూడా అచ్చం కాకుల ఆంటీ లాగే ఫోటోలకి ఫోజులిస్తూ రెచ్చిపోయాడు.

ఇక ఈ ఎపిసోడ్ లో కాకుల ఆంటీ ని కూడా తీసుకువచ్చారు. ఈ స్కిట్ లో ఎవరు డూప్ ఎవరు ఒరిజినల్ అన్న దాంతో స్కిట్ చేసి సందడి చేశారు. స్కిట్ లో భాగంగా గెటప్ శ్రీను ఎవరో తెలుసా అని రామ్ ప్రసాద్ అడగ్గా ఎవడ్రా వాడు అంటూ కసురుకుంటుంది . దీంతో గెటప్ శ్రీను పరువు పోయింది. ఆ తర్వాత ఇమన్యుల్, వర్ష లవ్ స్టొరీ గురించి తెలుసా? అని ఇమన్యుల్ అడగ్గా తూ.. అంటూ చీదరించుకుంది. ఆ తర్వాత వర్షను చూస్తే మీరు అలా అనరు.. ఆమె చాలా బాగుంటుంది అని ఇమాన్యుయేల్ అనగానే..అవును ఆమె బాగుంటుంది నువ్వే బాగుండవు అని ఇమన్యుల్ పరువు తీస్తుంది. మొత్తానికి ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించే లోకులు కాకులు ఆంటీ ఇప్పుడు జబర్థస్త్ లో సందడి చేసింది.