జూ. ఎన్టీఆర్ ని దూరం పెడుతున్న బాలకృష్ణ.. ఆ షో కి పిలవద్దంటూ ఆర్డర్స్…?

నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు
గతంలో ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ తనదైన శైలిలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో షో రేటింగ్స్ కూడా భారీ స్థాయిలో నమోదయ్యాయి.

అన్ స్టాపబుల్ మొదటి సీజన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో రెండవ సీజన్ కోసం అన్ని పనులు పూర్తయ్యాయి. తొందర్లోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఆహా లో ప్రసారం కానుంది. ఈ సీజన్ 2 కి సంబంధించిన బాలకృష్ణ లుక్ ఇటీవల విడుదలయ్యింది. సూటు ,బూటు వేసుకొని డిఫరెంట్ లుక్ తో ఉన్న బాలకృష్ణ పోస్టర్స్ ఈ షో మీద అంచనాలు మరింత పెంచాయి. ఇదిలా ఉండగా ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో పాల్గొని సెలబ్రెటీల లిస్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి

అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ లో బాలకృష్ణ తన కుటుంబ సభ్యులను గెస్ట్ గా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు ఈ షో గెస్ట్లుగా కనిపించనున్నారు. అయితే ఇటీవల హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల నందమూరి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది . అంతే కాకుండా బాలకృష్ణ ఈ షో కి ఎన్టీఆర్ ని రాడంబకుండా అందరికీ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది .