Suma Kanakala: సుమ అప్పుల విషయం బయట పెట్టి సుమను ఓ ఆట ఆడుకున్న జోగి బ్రదర్స్…!

Suma Kanakala: టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర మీద అనేక టీవీ షోలకు యాంకర్గా వ్యవహరిస్తూ తన మాటలతో ప్రేక్షకులను మాయ చేసి తన అభిమానులుగా మార్చుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ లేడీ యాంకర్ గా గుర్తింపు పొందింది. సుమన్ టీవీ ఛానల్ మాత్రమే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు కూడా యాంకర్ గా వ్యవరిస్తోంది. ఈమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఆమెకి ఎంత క్రేజ్ ఉందో. యాంకర్ గా మాత్రమే కాకుండా సుమ ఎన్నో సినిమాలలో నటించి నటిగా కూడ మంచి గుర్తింపు పొందింది.

ఇదిలఉండగా ఈ టీవి లో ప్రసారమవుతున్న క్యాష్ షో గత కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారమవుతు మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ షో ఇంత మంచి హిట్ అవ్వటానికి సుమ యాంకరింగ్ కూడా ఒక కారణమని చెప్పటంలో సందేహం లేదు. ప్రతీ శనివారం ఈటీవి లో ప్రసారమయ్యే ఈ షో లో సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. ఈ షో కి వచ్చే సెలబ్రిటీస్ కి ఫన్నీ టాస్క్ లు ఇస్తూ, వారిమీద పంచులు వేస్తూ నానా రచ్చ చేస్తుంది. తాజా గా ఈ షో కి సీనియర్ యాక్టర్లు వచ్చారు. రాగిణి, జోగి బ్రదర్స్,
కాదంబరి కిరణ్ వచ్చారు.
YouTube video player

సాధారణంగా ఈ షో కి వచ్చే సెలబ్రిటీల మీద సుమ పంచులు వేస్తూ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం జోగి బ్రదర్స్ తో పాటు కాదంబరి కిరణ్ కూడా సుమ మీద పంచ్ లు వేసి ఆమెను డామినేట్ చేశారు. ఈ క్రమంలో జోగి బ్రదర్స్ ఒక స్కిట్ చేస్తూ సుమ వయసు సంపాదన గురించి మాట్లాడారు. ఈ క్రమంలో జోగినాయుడు మాట్లాడుతూ సుమ ముందే ప్రాక్టీస్ చేసుకుంటుందా లేక ఇలా స్పాంటేనియస్ గా పంచ్ లు వేస్తుందా అని అడగగా .. సుమ అస్సలు పడుకోదు..రాత్రంతా మేల్కొని పంచులు ప్రాక్టీస్ చేసి పొద్దున్నే వేస్తుంది అని కృష్ణంరాజు అంటాడు. సమీర్ ఈ షో కి కాంట్రాక్టర్ తెలుసా? అని జోగి బ్రదర్ అనగా… సుమ తనకి డబ్బులు ఇవ్వటం లేదని , ఈ షో కి వస్తే ఎప్పుడో ఒకరోజు ఇస్తుంది కదా అని సమీర్ ఎక్కువ ఈ షో కి వస్తాడు అని కృష్ణంరాజు అంటాడు.