నాకు పేరు రావటానికి కారణం జబర్థస్త్ కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన చలాకి చంటి!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత 9 సంవత్సరాలుగా ప్రసారమవుతుంది. ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమేడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో చలాకి చంటి కూడా ఒకరు. జబర్దస్త్ కి రాకముందు చంటి ఎన్నో సినిమాలలో నటించాడు. సినిమాల ద్వారా తగిన గుర్తింపు లభించలేదు. జబర్దస్త్ కి వచ్చిన తర్వాత చంటి తను కామెడీ పంచలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. దీంతో చంటి పాపులారిటీ మరింత పెరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల “బెస్ట్ కపుల్” అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంటి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలో చంటితో పాటు సినిమా హీరో, హీరోయిన్ కూడా పాల్గొన్నారు . ఈ ఇంటర్వ్యూలో చంటి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో జబర్దస్త్ గురించి మాట్లాడుతూ.. తనకు పేరు రావటానికి కారణం జబర్దస్త్ కాదని అంతకుముందే నేను దాదాపు 20 సినిమాలలో నటించాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా చంటి జబర్థస్త్ నుండి మూడు సార్లు బయటికీ రావటానికి గల కారణం గురించి కూడా వెల్లడించాడు. సాధారణంగా మల్లెమాల కాంపౌండ్ నుండి ఒకసారి బయటికి వచ్చిన వారికి అందులో ప్రవేశం ఉండదు. కానీ చంటి మాత్రం జబర్దస్త్ నుండి మూడు సార్లు బయటికి వచ్చి మళ్లీ ఆ షో మీద ఉన్న ఇష్టంతో ప్రస్తుతం జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు.

మొదటిసారి జబర్దస్త్ నుండి బయటికి వచ్చినప్పుడు మేనేజర్ ఏడుకొండలు అంగీకారంతోనే మూడు నెలల పాటు రెస్ట్ తీసుకోవటానికి వచ్చానని చంటి వెల్లడించాడు. ఇక రెండవసారి తన పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా జబర్దస్త్ కి దూరమయ్యానని మూడవసారి నెలరోజుల పాటు అమెరికా టూర్ కారణంగా జబర్థస్త్ లో కనిపించలేదని వివరించాడు. ఈ క్రమంలో జబర్దస్త్ గురించి ఇప్పటివరకు ఎంతోమంది రకరకాలుగా కామెంట్లు చేశారు. మీరు ఏమని స్పందిస్తారు అని యాంకర్ అడగగా ఎవరి అభిప్రాయం వారు చెప్పారు. వారిని తప్పు పట్టే అర్హత నాకు లేదు అంటూ చంటి తెలివిగా తప్పించుకున్నాడు.