రెండోపెళ్ళి చేసుకున్న జబర్థస్త్ పంచ్ ప్రసాద్… పెళ్ళి కూతురు ఎవరో తెలుసా?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రసాద్ ఆ తర్వాత జబర్దస్త్ లో కనిపించే అవకాశం దక్కించుకున్నాడు. ఇలా జబర్దస్త్ ద్వారా పంచ్ ప్రసాద్ గా గుర్తింపు పొందాడు. అయితే ఒకానొక సమయంలో ప్రసాద్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురయింది. ఆ సమయంలో జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు మల్లెమాల సంస్థ ఆర్థికంగా సహాయం చేయటం వల్ల ప్రసాద్ ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇదిలా ఉండగా ప్రసాద్ కుటుంబం విషయానికి వస్తే ప్రసాద్ ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి తెలిసినా కూడా ఆ అమ్మాయి ప్రసాద్ కి జీవితాంతం తోడుగా ఉండాలని నిర్ణయించుకొని కిడ్నీ దానం చేయడానికి కూడా సిద్ధపడి ప్రసాద్ ని వివాహం చేసుకుంది. ఇదిలా ఉండగా పంచ్ ప్రసాద్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంచ్ ప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ ఇమాన్యుయేల్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్త చూసిన నెటిజన్స్ ప్రసాద్ రెండో పెళ్లి చేసుకోవటం ఏంటి అని ఆలోచనలో పడ్డారు.

అసలు విషయం ఏమిటంటే… యూట్యూబ్ వీడియోస్ కి అత్యధిక వ్యూస్ రావడం కోసం ఇమాన్యుల్ ఇలా అందరిని మాయ చేసినట్లు తెలుస్తోంది. ప్రసాద్ పెళ్లికి సంబంధించిన ఒక ఫోటోలో భార్య ముఖం బ్లర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో.. అందరూ ఈ వార్త నిజమని నమ్మేశారు. అంతేకాకుండా పంచ్ ప్రసాద్ తన భార్యకి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోతో పాటు ఈ ఫోటోలను జత చేసి షేర్ చేయటంతో అందరూ నిజంగానే ప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నాడని బ్రమపడ్డారు. అయితే కేవలం వ్యూస్ కోసం మాత్రమే ఇమాన్యుయేల్ ఇలా అందరిని కన్ఫ్యూజ్ చేసినట్లు అసలు విషయం బయటపడింది.