జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ల అన్నపూర్ణమ్మ ఇంత సంపాదిస్తోందా..? తెలిస్తే షాక్ అవుతారు…!

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న అన్నపూర్ణమ్మ కొన్ని వందల సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించిన ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. యుక్త వయసు నుండి ఇప్పటివరకు కూడా వరుస సినిమాలలో నటిస్తూ బాగా సంపాదిస్తోంది. ఇలా సినిమాలలోనే కాకుండా ఈ మధ్యకాలంలో బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించిన అన్నపూర్ణమ్మ బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలలో సందడి చేస్తోంది.

ఈ కామెడీ షోలలో అన్నపూర్ణమ్మ ఆది, రాంప్రసాద్ వంటి వారి మీద వేసే పంచులు, సెటైర్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇదివరకు ప్రత్యేక కార్యక్రమాలలో మాత్రమే కనిపించే అన్నపూర్ణమ్మ ఇప్పుడు రెగ్యులర్ గా ఈ షోస్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఆది, రామ్ ప్రసాద్ వేసే పంచులకు రివర్స్ పంచులు వేస్తూ వారి పరువు తీస్తోంది. ఇటీవల ఒక ఎపిసోడ్ లో గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక స్కిట్ చేశాడు. ఆ స్కిట్ లో అన్నపూర్ణమ్మ చేసిన యాక్టింగ్ కి నేనే అనుకుంటే నా కన్నా ఎక్కువగా చేస్తోంది అంటూ సెటైర్లు వేసాడు. ఇలా తన పంచ్ లతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అన్నపూర్ణమ్మ ఈ షోల ద్వారా భారీగానే సంపాదిస్తుందని సమాచారం.

ఇక జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీల్లో సందడి చేస్తున్నందుకు గాను అన్నపూర్ణమ్మకు మల్లెమాల వారు భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అన్నపూర్ణమ్మ ఒక్కో కాల్షీట్ కు రెండున్నర లక్షల వరకు పారితోషికం అందుకుంటుందట. అయితే ఇంత అమౌంట్ జబర్థస్త్ ఉన్న ఫేమస్ కమెడియన్స్ కూడా ఇవ్వరట. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్‌ తో పాటు ఎన్నో స్పెషల్ ఈవెంట్స్ లో కూడా ఆమె జోరు కొనసాగుతోంది. అయితే తీసుకునే రెమ్యునరేషన్ కి సరిపడా కామెడీ కూడా చేస్తోంది.