పెళ్ళి కాకముందే కాబోయే భర్తతో కలిసి రచ్చ చేస్తున్న జబర్దస్త్ బ్యూటీ?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా ఫేమస్ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఫిమేల్ కమెడియన్స్ కూడా జబర్దస్త్ లో సందడి చేస్తున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వర్ష, రోహిణి, సుజాత, షబీనా వంటిఫిమేల్ కమెడియన్స్ కూడా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంటున్నారు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన షబీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట బుల్లితెర నటిగా ఎన్నో సీరియల్స్ లో నటించిన షబీనా సీరియల్స్ ద్వారా తగిన గుర్తింపు పొందలేకపోయింది.

ఈ క్రమంలో జబర్దస్త్ లో అవకాశం రావడంతో బాగా ఫేమస్ అయ్యింది. జబర్దస్త్ లో వర్ష , రష్మి , సుజాత లాగే షబీనాకి కూడా లవ్ ట్రాక్ క్రియేట్ చేశారు. కానీ అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇలా సీరియల్స్ జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన షబీనా ఇటీవల తనకి కాబోయే భర్తను పరిచయం చేసింది. జూన్ 17వ తేదీన ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ అమ్మడు ఆగస్టు 17వ తేదీన తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకి కాబోయే భర్తని పరిచయం చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేస్తూ తనకి కాబోయే భర్తని కూడా ట్యాగ్ చేసింది.

ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో షబీనా షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో షబీనా తనకి కాబోయే భర్తతో కలిసి బైక్ మీద రైడ్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మొదటిసారిగా నాకు కాబోయే భర్తతో కలిసి రీల్ చేస్తున్న అంటూ చెప్పుకొచ్చింది. ఇలా సోషల్ మీడియాలో రీల్ చేస్తూ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం షబీనా వివాహం చేసుకోబోయే వ్యక్తి గురించి నేటిజెన్లు ఆరా తీస్తున్నారు. తొందర్లోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న షబీనా వివాహం తర్వాత జబర్దస్త్ లో కనిపిస్తుందో లేదో చూడాలి మరి.