జబర్దస్త్ కు దెబ్బ మీద దెబ్బ… ఆ ఇద్దరిని బిగ్ బాస్ కు ఆహ్వానించి గట్టి దెబ్బ కొట్టిన స్టార్ మా!

బుల్లితెరపై గత పది సంవత్సరాల నుంచి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.ఇలా ఈ కార్యక్రమం అత్యధిక రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్న నేపథ్యంలో బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమెడియన్స్ ఈ కార్యక్రమం నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారందరూ బయటికి వెళ్లిపోవడంతో జబర్దస్త్ కార్యక్రమం మునపటి కంటే కాస్త రేటింగ్స్ తగ్గిపోయాయని చెప్పాలి.

అయితే ఇప్పుడున్న కమెడియన్స్ సరికొత్త స్కిట్ ల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే లేడీ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఫైమా కిఎంతోమంది అభిమానులు ఉన్నారు అలాగే సీనియర్ నటుడిగా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి చలాకి చంటికి సైతం ఎంతో మంది అభిమానులు ఉన్నారని చెప్పాలి. ఇక వీరిద్దరూ చేసే స్కిట్లకు కూడా మంచి ఆదరణ వస్తుంది.

ఇకపోతే తాజాగా వీరిద్దరూ కూడా జబర్దస్త్ కార్యక్రమం నుంచి పక్కకు వెళ్లడంతో జబర్దస్త్ కార్యక్రమానికి మరొక దెబ్బ పడిందని చెప్పాలి. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి ఆదరణ ఉన్నటువంటి ఈ ఇద్దరు కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ మా ఆహ్వానించడంతో వీరు జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చారు. ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వీరిద్దరిని కూడా బిగ్ బాస్ హౌస్ కి ఆహ్వానించి స్టార్ మా మల్లెమాల వారిపై గట్టి దెబ్బ కొట్టిందని తెలుస్తోంది.ఇక బిగ్ బాస్ కి వచ్చినవాళ్లు మరోసారి తిరిగి ఈ టీవీ కార్యక్రమాలలోకి వెళ్ళరు. కానీ ఫైమా, చలాకి చంటి ఈ కార్యక్రమానికి తిరిగి వెళ్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.