V.V. Vinayak: ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలాంటి క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కానీ ఇటీవల కాలంలో ఈయన మాత్రం సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారని చెప్పాలి. తెలుగులో ఈయన ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన చత్రపతి హిందీ మూవీకి దర్శకత్వం వహించారు కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగిన వి.వి.వినాయక్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నేపథ్యంలో ఈయనకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈయన సినిమాలు చేయకపోవడానికి కారణం తన అనారోగ్య సమస్యలేనని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి తరచు ఈయన అనారోగ్యానికి గురయ్యారని హాస్పిటల్ పాలయ్యారు అంటూ వార్తలు వచ్చాయి.
గత కొద్ది రోజుల క్రితం ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఈయనకు మేజర్ సర్జరీ కూడా జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. ఇలా వి.వి.వినాయక్ ఆరోగ్యం గురించి వార్తలు వస్తున్న ప్రతిసారి ఆయన టీం ఖండిస్తూ కొట్టి పారేస్తున్నారు ఇకపోతే నేడు కూడా ఈయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది అంటూ వార్తలు వస్తున్నా నేపథ్యంలో
వి.వి.వినాయక్ టీం స్పందించి క్లారిటీ ఇచ్చారు ఏదైనా వార్తలు రాసేముందు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ ఖండించారు.
ఇకపోతే ఈయనకు సంబంధించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. సినిమాలకు దూరంగా ఉన్న ఈయన ఇటీవల కాలంలో కాస్త గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయారు అందుకే ఈయన ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అందుకే సినిమాలకు కూడా దూరంగా ఉన్నారనీ అందరూ భావిస్తున్నారు.