Big Boss 6: బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసిన జబర్దస్త్ బ్యూటీ.. ఈ సారి పక్కా ఎంట్రీ?

Big Boss6: టాలీవుడ్ ఇండస్ట్రీలో టెలివిజన్ చరిత్రలో బాగా పాపులర్ అయిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో కూడా ఒకటి. ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగులో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ రియాలిటీ షో అంచనాలను మించి ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు బుల్లితెర మీద ఐదు సీజన్లను పూర్తిచేసుకుని, ఓటిటి లో ఒక నాన్ స్టాప్ సీజన్ ని పూర్తీ చేసుకుంది. ఓటిటిలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ నాన్ స్టాప్ సీజన్ బిగ్ బాస్ చరిత్రలోనే భిన్నమైనది గా గుర్తింపు పొందింది. ఈ నాన్ స్టాప్ సీజన్లో ఒక లేడీ కంటెస్టెంట్ టైటిల్ సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది.

ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ పూర్తయిన నాటి నుండి బిగ్ బాస్ సీజన్ 6 గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ 6 కోసం కంటెస్టెంట్ ల వేట మొదలయ్యింది. ప్రస్తుతం కొంతమంది పేర్లు కూడా ఖరారు చేశారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు సెట్ వర్క్ కూడా ప్రారంభించినట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే వారిలో జబర్ధస్త్ బ్యూటీ పేరు కూడ వినిపిస్తోంది . ఆమె ఎవరో కాదు తన అందం, కామెడీ టైమింగ్ తో అందరికీ బాగా పరిచయమైన భామ వర్ష.

జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన వర్ష అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. దీంతో ఆమెకి సీరియల్స్ లో కూడా నటించే అవకాశం వచ్చింది. సీరియల్స్ లో నటించటం వల్ల వర్ష మరింత పాపులర్ అయ్యింది. ఇంత పాపులర్ అయిన వర్ష కి బిగ్ బాస్ సీజన్ 5 , నాన్ స్టాప్ సీజన్ లో కూడా పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె బిగ్ బాస్ కి వెళ్ళలేకపోయింది. తాజాగా ఆమెకి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే అవకాశం కూడా వచ్చిందని సమాచారం. మరి ఈ అవకాశాన్ని వర్ష సద్వినియోగం చేసుకుంటుందో? లేదో ? చూడాలి మరి.