రోడ్డుమీద బిచ్చమెత్తుకుంటున్న జబర్దస్త్ ఆర్టిస్టులు.. చూస్తే అసలు గుర్తు పట్టలేరు!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ప్రేక్షకులలో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో మల్లెమాల వారు శ్రీదేవీ డ్రామా కంపెనీ పేరుతో మరొక కొత్త కామెడీ షో స్టార్ట్ చేశారు. ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న ఈ కామెడీ షోలో జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు సీరియల్ ఆర్టిస్టులు కూడా సందడి చేస్తున్నారు. ఈ షో కి కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఇదిలా ఉండగా ఏవైనా పండగలు, పూజలు, స్పెషల్ డేస్ సందర్భంగా మల్లెమాల వారు స్పెషల్ ఈవెంట్స్ చేస్తు ఉంటారు.

ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా మల్లెమాలవారు మన ఊరి దేవుడు అనే ఒక కొత్త ఈవెంట్ చేశారు. ఈ ఈవెంట్ లో జబర్థస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్స్ ఫుల్ రచ్చ చేశారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ఈవెంట్ లో ప్రముఖ నటుడు నాగినీడు, కమెడియన్ కృష్ణ భగవాన్, అలనాటి హీరోయిన్స్ జయసుధ, కుష్బూ సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్ లో జబర్థస్త్ కమెడియన్స్ చేత మల్లెమాల వారు ప్రయోగాలు చేయించారు. ఈ క్రమంలో కొన్ని సాహసాలు కూడా చేయించారు.

అయితే గతంలో ఇలాంటి ఒక స్పెషల్ ఈవెంట్ కోసం జబర్దస్త్ వర్ష, ఇమాన్యుల్ చేత పిచ్చివాళ్లుగా గెటప్ లు వేయించి రోడ్డు మీద వదిలేశారు. అందరిని బిక్షం అడుగుతున్న వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే వినాయకచవితి సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో కూడా కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు బిచ్చగాళ్లుగా మారి రోడ్లమీద సందడి చేశారు. జబర్దస్త్ కమెడియన్స్ పవిత్ర, ప్రవీణ్, ఫైమా ,నూకరాజు, వంటి వారంతా బిచ్చగాళ్లలా మారి రోడ్డు మీదకు వచ్చినట్టు ప్రోమోలో కనిపిస్తోంది. అయితే ఆ బిచ్చగాళ్ళ గెటప్ లో వారిని గుర్తుపట్టడం చాలా కష్టంగా మారిపోయింది. వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మల్లెమాలవారు ఇలా కమెడియన్స్ ని బిచ్చగాళ్లుగా మార్చి రోడ్లమీదకు వదిలేశారు. మొత్తానికి ఈ ఈవెంట్ ప్రోమో చూస్తుంటే మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది.